ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:27 AM

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

కులకచర్ల: కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

కులకచర్ల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బండవెల్కిచర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బొంరెడ్డిపల్లికి బీటీ రోడ్డు పనులను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 104మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ మొగులయ్య, తహసీల్దార్‌ మురళీధర్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు భీమ్‌రెడ్డి, భరత్‌కుమార్‌, బీఎస్‌.ఆంజనేయులు, గోపాల్‌నాయక్‌, అంజిలయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

దోమ: దోమ మండల కేంద్రం నుంచి రూ.6కోట్ల వ్యయంతో మోత్కుల కుంటతండా, నెర్ల తండా, గొట్ట చెల్కతండాకు బీటీరోడ్డు పనులను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. అనంతరెడ్డిపల్లికి రూ.55లక్షలు, రూ.కోటీ 25లక్షలతో బట్లచందారం గ్రామానికి స్థానిక నాయకులతో కలిసి రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం దిర్సంపల్లిలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

పూడూరు: మండలంలోని బాకాపూర్‌, చింతలపల్లి గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సురేందర్‌, రఘునాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌, షకీల్‌, శ్రీనివాస్‌రెడ్డి, పెంటయ్య పాల్గొన్నారు.

మోడల్‌ స్కూల్‌కు అన్ని వసతులు

పరిగి: మోడల్‌ స్కూల్‌కు కావాల్సిన అన్ని వసతులు అన్ని సమకూరుస్తామని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని జాఫర్‌పల్లి మోడల్‌స్కూల్‌లో శనివారం నిర్వహించిన మాక్‌పోలింగ్‌లో పాల్గొన్నారు. మాక్‌పోలింగ్‌లో ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, తహసీల్దార్‌ ఆనంద్‌, పరశురాంరెడ్డి, హన్మంత్‌ముదిరాజ్‌ ఉన్నారు.

ఎమ్మెల్యే రాక కోసం చీకట్లో నిరీక్షణ

కులకచర్ల: స్థానిక రైతు వేదికలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి రాక కోసం మహిళలు చీకట్లో నిరీక్షించాల్సి వచ్చింది. శనివారం మధ్యాహ్నం 2గంటలకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ నేపథ్యంలో లబ్ధిదారులు మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చారు. రాత్రి 7:30గంటలైనా ఎమ్మెల్యే కులకచర్లకు చేరుకోలేదు. సాయంత్రం 6:30గంటలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 7:30 గంటలకు విద్యుత్‌ వచ్చినా ఎమ్మెల్యే రాకపోవడం గమనార్హం.

Updated Date - Nov 24 , 2024 | 12:27 AM