ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మేడ్చల్‌ బాలాజీనగర్‌లో చోరీ

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:39 AM

మేడ్చల్‌ పట్టణంలోని బాలాజీ నగర్‌లో ఇంటికి వేసిన తాళం విరగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు.

మేడ్చల్‌ టౌన్‌, అక్టోబరు 9: మేడ్చల్‌ పట్టణంలోని బాలాజీ నగర్‌లో ఇంటికి వేసిన తాళం విరగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు. బాలాజీనగర్‌ నివాసి రాజేంద్రప్రసాద్‌ మంగళవారం రాత్రి మేడ్చల్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనటానికి ఇంటికి తాళం వేసి కుంటుంబ సమేతంగా వెళ్లాడు. తిరిగి రెండు గంటల అనంతరం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం విరిగి తలుపులు తెరిచి ఉన్నాయి. అనంతరం ఇంటి బీరువాను తెరిచి చూడగా అందులో దాచిన తొమ్మిది తులాల బంగారం, ఐదు కిలోల వెండి, రూ.8వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - Oct 10 , 2024 | 07:07 AM