అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:55 PM
అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని కుక్కిందలో మంగళవారం చోటుచేసుకుంది.
ధారూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని కుక్కిందలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దోర్నాల్ గ్రామానికి చెందిన స్వాతి(18)ని మండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన కొనింటి శ్రీకాంత్(20) రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత కొంతకాలం వీరి సంసారం సాఫీగానే కొనసాగింది. ఆ తర్వాత భర్త శ్రీకాంత్‌తో పాటు అత్త, మామలు వెంకటమ్మ, యాదయ్య, అడపడుచులు శారీరకంగా హింసించడంతో పాటు సూటిపోటి మాటలతో వేధించేవారు. ఈ మధ్య వీరి వేధింపులు ఎక్కువ కావటంతో భరించలేని స్వాతి ఈనెల 16వ తేదీన సాయంత్రం ఇంట్లోనే పొలంలో గడ్డిమందు తాగి అస్వస్థతకు గురైంది. ఈమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందింది. స్వాతి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, మామ, ఆడపడుచుపై బాల్యవివాహం, పోక్సో, వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించటం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Nov 19 , 2024 | 11:55 PM