ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అప్పు చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN, Publish Date - Mar 27 , 2024 | 12:09 AM

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి గొంతు, చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది.

ఊర్కొండ, మార్చి 26 : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి గొంతు, చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుకు చెందిన దుర్గేష్‌ ఏడు సంవత్సరాల నుంచి ఆమనగల్లు పట్టణంలో ఫొటోఫ్రేమ్‌ వర్క్‌ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అవసరాల కోసం ఒకరి వద్ద అప్పుగా రూ.30వేలు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చే క్రమంలో మరొకరి వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారి కుటుంబంలో వివాహం ఉండటంతో అప్పు తిరిగి చెల్లించలేకపోతున్నానని మనస్తాపం చెందాడు. ఊర్కొండ- ఊర్కొండపేట మార్గమధ్యలో ఉన్న గుట్టలోకి వెళ్లి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గొంతుకైన గాయం బాధకు తాళలేక రోడ్డుపైకి వచ్చి కేకలు వేస్తూ కిందపడిపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 12:09 AM

Advertising
Advertising