రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
ABN, Publish Date - Oct 10 , 2024 | 12:03 AM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలంలో జరిగింది. ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గండిగూడ ఆటోనగర్ కమాన్ సమీపంలో బుధవారం ఉదయం ఎన్‌హెచ్ 44 రోడ్డును ఓ గుర్తుతెలియని వ్యక్తి దాటుతుండగా శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
శంషాబాద్ రూరల్, అక్టోబరు 9: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలంలో జరిగింది. ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గండిగూడ ఆటోనగర్ కమాన్ సమీపంలో బుధవారం ఉదయం ఎన్‌హెచ్ 44 రోడ్డును ఓ గుర్తుతెలియని వ్యక్తి దాటుతుండగా శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు గమనించి డయల్ 100కు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అతడి వయసు 50-55 సంవత్సరాలు ఉంటుందని, బ్లూకలర్ షర్ట్, గ్రేకలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, తెలుపు గడ్డం, పొడవైన జుట్టు ఉందని తెలిపారు. స్థానికులను విచారించగా బిక్షాటన చేసే వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేశారు.
Updated Date - Oct 10 , 2024 | 07:28 AM