నిరుపయోగం.. నిఘా నేత్రం
ABN, Publish Date - Nov 25 , 2024 | 12:10 AM
మండలంలోని పలు గ్రామాల్లో పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పాడైపోవడంతో దిష్టిబొమ్మలా మారాయి. యాచారం మండల కేంద్రంలో పదేళ్లక్రితం రూ.2లక్షలతో బిగించిన సీసీ కెమెరాలు నేడు పని చేయడం లేదు. మరమ్మతులు చేయించాల్సిన అధికారులు, నాయకులు వాటిపై శ్రద్ధ తీసుకోలేకపోవడంతో వృథాగా ఉన్నాయి.
గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలు
మరమ్మతులకు నోచుకోని వైనం
కేసుల పరిష్కారంలో ఖాకీలకు ఇబ్బంది
యాచారం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పాడైపోవడంతో దిష్టిబొమ్మలా మారాయి. యాచారం మండల కేంద్రంలో పదేళ్లక్రితం రూ.2లక్షలతో బిగించిన సీసీ కెమెరాలు నేడు పని చేయడం లేదు. మరమ్మతులు చేయించాల్సిన అధికారులు, నాయకులు వాటిపై శ్రద్ధ తీసుకోలేకపోవడంతో వృథాగా ఉన్నాయి. మాల్, గున్‌గల్ గ్రామాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఆకులమైలారం గ్రామంలో రెండేళ్లక్రితం బిగించిన సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదు. ఇటీవల చోరీ జరిగిన తీరు తెలుసుకునేందుకు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. అవి పని చేయకపోవడంతో దొంగల జాడ నేటికీ తెలుసుకోలేకపోతున్నారు. ఇదే గ్రామంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళను బెదిరించి మంగళసూత్రం, గాజులు తస్కరించడంతో పోలీసులు గుమ్మడవెళ్లి, ఇబ్రహీంపట్నం, కొహెడలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో అదే గ్రామంలో నెంబర్‌ప్లేట్ లేని కారు అద్దెకు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. దాంతో దోపిడీ విషయం బట్టబయలైంది. మేడిపల్లిలో సీసీ కెమెరాలు కూడా అస్సలు పని చేయడం లేదు. గున్‌గల్‌లో పలు కెమెరాలు వృథాగా ఉన్నాయి. కుర్మిద్ద, తాటిపర్తి నానక్‌నగర్, కొత్తపల్లి, మల్కీజ్‌గూడ, చిన్నతూండ్ల, చౌదర్‌పల్లి, గడ్డమల్లాయాగూడ, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, నజ్దిక్‌సింగారంలో కెమెరాలు అసలే లేవు. కెమెరాలకు మరమ్మతులు చేయాలని, దాతలు చొరవతో కెమెరాలు లేనిచోట ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Nov 25 , 2024 | 12:10 AM