ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్సులు అందజేస్తాం

ABN, Publish Date - Jun 08 , 2024 | 11:51 PM

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా స్కూల్‌ డ్రెస్సులను కుట్టిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీలత తెలిపారు.

దుస్తులను పరిశీలిస్తున్న డీఆర్డీఏ పీడీ శ్రీలత

మహేశ్వరం, జూన్‌ 8: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా స్కూల్‌ డ్రెస్సులను కుట్టిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీలత తెలిపారు. శనివారం తుమ్మలూరు, హర్షగూడ, నాగారం, మహేశ్వరం, దుబ్బచర్ల క్లష్టర్లలో కొనసాగుతున్న మహిళా శక్తి కుట్టు కేంద్రాలను జిల్లా విద్యాఽధికారి సుసీందర్‌రావుతో కలిసి ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విదార్థుల దుస్తుల తయారీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని పాఠశాలలకు దుస్తుల పంపిణీ చేస్తామన్నారు. యూనిఫాంల తయారీ 80శాతం పూర్తయిందన్నారు. మహిళలను ఆర్థికంగా మరింత ఎదగాలనే ఉద్దేశ్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మండలంలోని 43 ప్రభుత్వ పాఠశాలల్లోని 4,596 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఒక్కరికి రెండు జతల చొప్పున మొత్తం 9,192 దుస్తులను కుట్టిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం ఎంపీడీవో శైలజారెడ్డి, మండల విద్యాధికారి కృష్ణ, ఏపీఎం సత్యనారాయణ తధితరులు పాల్గొన్నారు.

Read more!

Updated Date - Jun 08 , 2024 | 11:51 PM

Advertising
Advertising