భూ బాధితులకు అండగా ఉంటాం
ABN, Publish Date - Nov 19 , 2024 | 10:57 PM
మండలంలోని ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్కు కోసం టీజీఐఐసీ భూ బాఽధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.బూరనర్సయ్యగౌడ్ అన్నారు.
-భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
-బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్
ఇబ్రహీంపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్కు కోసం టీజీఐఐసీ భూ బాఽధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.బూరనర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం ఎలిమినేడులో బీజేపీ భరోసా కార్యక్రమం పేరుతో బాధిత రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా రైతుల పక్షాన నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు బుస్సు శ్రీకాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఇక్కడ సర్వే నెం. 166, 420, 492, 512లలో 671.29 ఎకరాలపై 504 మంది పేదలకు అస్సైన్‌మెంట్ పట్టాలిచ్చారని తెలిపారు. కాగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం టీఎ్‌సఐఐసీ ద్వారా ఏరోస్పేస్ పార్కుకోసం భూసేకరణకు పూనుకుని 571.29 ఎకరాలకు సంబంధించి 481 మంది రైతుల నుంచిభూసేరకణ చేయాలని నిర్ణయించి 2018లో నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఎకరాకు రూ.12 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి 2019లో భూసేకరణకు ప్రారంభించిందని అందులోనూ కొందరు రైతులు మాత్రమే పరిహారం పొందారని చెప్పారు. అంతేగాక తమకు ఉన్న పట్టా భూమి కంటే తక్కువ విస్తీర్ణం చూపుతూ పరిహారం ఇవ్వజూపుతున్నారంటూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అంతేగాక తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ భూములు కోల్పతున్న రైతులకు భూమికి భూమి ఇవ్వాలని లేదంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ కూడా వర్తింజేయాలన్నారు. సమావేశంలో బీజేపీ నాయకలు బోసుపల్లి ప్రతాప్, అర్జున్‌రెడ్డి, లచ్చిరెడ్డి, అంజయ్యయాదవ్, భోజిరెడ్డి, జక్క రవీందర్‌రెడ్డి, శ్రీవలం యాదవ్, శేఖర్‌రెడ్డి, భూనిర్వాసితులు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, మంద కుమార్, కొట్టంల మహేందర్, ధనంజయ తదితరులు పాల్గ్గొన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 10:57 PM