ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ రైతుకు న్యాయం చేస్తాం

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:33 AM

ప్రభుత్వ భూముల విషయంలో ప్రతీ ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని పీరంపల్లి గ్రామంలో అధిక విస్తీర్ణంలో భూములు నమోదైన సర్వే నంబరు 709, 06లో భూములు, చౌడాపూర్‌ మండలంలోని లింగంపల్లి పరిధిలోని భూములను ఆయన పరిశీలించారు.

పీరంపల్లి పాఠశాల ఆవరణలో మొక్క నాటుతున్న కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

కులకచర్ల, సెప్టెంబరు 6: ప్రభుత్వ భూముల విషయంలో ప్రతీ ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని పీరంపల్లి గ్రామంలో అధిక విస్తీర్ణంలో భూములు నమోదైన సర్వే నంబరు 709, 06లో భూములు, చౌడాపూర్‌ మండలంలోని లింగంపల్లి పరిధిలోని భూములను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముందుగా పీరంపల్లి పాఠశాల ఆవరణలో ఆయన మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన అధిక విస్తీర్ణంలో భూములు నమోదైన రైతులతో ఆయన మాట్లాడారు. త్వరలోనే సర్వే చేయించి రైతులకు న్యాయం చేస్తామన్నారు. అనంతరం లింగంపల్లి చెరువు తూమును పరిశీలించారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మురళీధర్‌, ఎంపీడీవో రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 12:33 AM

Advertising
Advertising