ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌తోనే పేదలకు సంక్షేమ పథకాలు

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:28 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

బషీరాబాద్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బషీరాబాద్‌లోని రైతు వేదికలో శనివారం తహసీల్దార్‌ వై.వెంకటేష్‌ అధ్యక్షతన రూ.54లక్షల 6వేల 264 విలువైన కల్యాణలక్ష్మి, షాదీమూబారక్‌ చెక్కులతో పాటు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా నవాంద్గీ నుంచి కర్ణాటక హక్కోడ వరకు గల 1.45కిలోమీటరు సరిహద్దు లింకు రోడ్డుకు రూ.కోటి 15లక్షలు మంజూరు కాగా ఎమ్మెల్యే శనివారం కర్ణాటక వైద్య, విద్యశాఖ మంత్రి శరణ్‌ప్రకాష్‌ రుద్రప్ప పాటిల్‌తో కలిసి ఆయన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కాగా, ఎమ్మెల్యే పాల్గొన్న చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బషీరాబాద్‌ ఏఎంసీ వైస్‌చైర్మన్‌ చందర్‌నాయక్‌కు కూర్చీ కేటాయించకుండా నిలబెట్టడంతో చర్చనీయంశమైంది. వైస్‌చైర్మన్‌ గిరిజనుడు కావడంతో కూర్చీ ఇవ్వకుండా, ప్రొటోకాల్‌ పాటించకుండా అవమానపర్చారని ఆయన అభిమానులు మండిపడ్డారు.

Updated Date - Nov 24 , 2024 | 12:28 AM