ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓవర్‌లోడ్‌ వాహనాలపై చర్యలేవి?

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:53 PM

రహదారిపై ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాలకు నియంత్రణ కరువైంది. విరుద్ధంగా భారీ వాహనాలు సరుకులను సరఫరా చేస్తుండటంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి.

ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న వాహనం

  • నిబంధనలు అతిక్రమిస్తున్న లారీలు

  • దెబ్బతింటున్న ఆర్‌అండ్‌బీ రోడ్లు

  • పట్టించుకోని అధికారులు

తాండూరు రూరల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రహదారిపై ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాలకు నియంత్రణ కరువైంది. విరుద్ధంగా భారీ వాహనాలు సరుకులను సరఫరా చేస్తుండటంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నిధులు లేక నీరసించిన ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు. సిమెంట్‌ కర్మాగారాలకు తాండూరులో 500ల వరకు నిత్యం లారీలు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా లారీలు,టిప్పర్లు రాకపోకలు సాగిస్తుంటారు. అదేవిధంగా వందలాది ఎకరాల్లో నాపరాయి పరిశ్రమలు, సుద్ద గనులు, సీసీఐ, ఇండియా సిమెంట్‌ కర్మాగారాలు విస్తరించి ఉన్నాయి.

టన్నుల కొద్దీ ఖనిజం..

7వ నెంబర్‌ జాతీయ రహదారిపై సామర్థ్యాన్ని మించి లారీల్లో ఎర్రమట్టి, సిమెంట్‌ బస్తాలు, నాపరాతి బండలు, సిమెంటు ట్యాంకర్లు, సుద్దను తాండూరు రోడ్ల గుండా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ప్రతి లారీలో15టన్నుల నుంచి 20 టన్నుల వరకు ఖనిజాన్ని రవాణా చేయాల్సి ఉండగా 40టన్నులను తరలిస్తున్నారు. దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయి.

నిబంధనలకు వరుద్దంగా రవాణా

తాండూరు మండలం ఓగీపూర్‌ గ్రామ శివారులో విస్తరించిన నాపరాయి గనుల నుంచి, కరణ్‌కోట్‌ గ్రామంలో నిర్మించిన సీసీఐ సిమెంట్‌ కర్మాగారం నుండి ఇదే మండలంలో మల్కాపూర్‌ గ్రామ శివారులోని ఇండియా సిమెంట్‌ కర్మాగారం, మల్కాపూర్‌, కోటబాస్పల్లి శివారులో నిక్షిప్తమైన నాపరాయి రాళ్లు, పాలిషింగ్‌ బండలు తాండూరు మీదుగా హైదరాబాద్‌, ముంబై, కర్నూల్‌, కడప వంటి సుదూర ప్రాంతాలకు నాపరాయిని తరలిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్తుండటంతో అధిక లోడ్‌ను నింపి పంపుతున్నారు. మరోపక్క పాషాపూర్‌, ఆడ్కిచర్ల, తట్టేపల్లి, తదితర ప్రాంతాల నుంచి ఎర్రమట్టిని అధిక లోడ్‌తో సిమెంటు కర్మాగారాలకు రవాణా అవుతున్నాయి. రెగ్యులర్‌ వాహనాలు కావడంతో చెక్‌పోస్టులకు, తనిఖీ అధికారులకు తక్కువ బరువు ఉన్న రశీదులను చూయించి నిబంధనలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై కరన్‌కోట్‌ గ్రామస్తులు ఓవర్‌ లోడ్‌తో వెళుతున్న లారీలను నియంత్రించాలని గతంలో కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీలను నియంత్రించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:53 PM