ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు పూర్తయ్యేనా?

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:05 AM

తాండూరులో రూ.7.50కోట్ల వ్యయంతో తలపెట్టిన ఇంట్రిగేటెడ్‌ (సమీకృత) మార్కెట్‌యార్డును పిల్లర్లు కట్టి వదిలేశారు. ఏడాది కాలంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

పిల్లర్లు కట్టి వదిలేసిన ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు

  • పిల్లర్లు కట్టి వదిలేసిన కాంట్రాక్టర్‌

  • ఆదాయాన్ని కోల్పోతున్న మార్కెట్‌ కమిటీ

  • వృథాగా పడి ఉన్న రైతుబజారు షెడ్లు, దుకాణాలు

తాండూరు, నవంబరు 4: తాండూరులో రూ.7.50కోట్ల వ్యయంతో తలపెట్టిన ఇంట్రిగేటెడ్‌ (సమీకృత) మార్కెట్‌యార్డును పిల్లర్లు కట్టి వదిలేశారు. ఏడాది కాలంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టును మంజూరు చేసిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోవడంతో నిధులు మంజూరు కాలేదు. దీంతో కాంట్రాక్టర్‌ చేతులెత్తేశాడు. గుంతలు తవ్వి ఇనుపరాడ్‌లు కట్టి వదిలేశాడు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌యార్డు నిర్మిస్తే తాండూరు పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గంలోని పెద్దేముల్‌, యాలాల, తాండూరు ప్రజలతో పాటు సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక వాసులకు ఉపయోగకరంగా ఉండేది.

ప్రణాళిక ఇలా..

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డులో 130 కూరగాయాల, 42 పువ్వులు, పండ్లు, 14 మాంసం దుకాణాలు నిర్మించాలని ప్రణాళికను రూపొందించారు. 192షాపులు నిర్మించి ప్రజల్లోకి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నించారు. అప్పటి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా మార్కెట్‌యార్డుకు శంకుస్థాపన చేశారు. ఐదు నెలల కాల వ్యవధిలో పూర్తికావాల్సి ఉండగా ఏడాది అయినా పనులు ముందుకు సాగలేదు.

ఆదాయాన్ని కోల్పోతున్న మార్కెట్‌ కమిటీ

తాండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఇంటిగ్రేటెడ్‌ గోదాంల నిర్మాణం ద్వారా ఆదాయం సమకూరేంది. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పేరిట గోదాంలకు స్థలాన్ని కూడా కేటాయించారు. కాంట్రాక్టర్‌ ఖాళీ స్థలంలో కాకుండా మధ్యలో ఉన్న గోదాంలను కూల్చివేశారు. ప్రస్తుతం రెండు గోదాంలు నిరూపయోగంగా ఉన్నాయి. రైతులకు ఈ గోదాం ఎంతో ఉపయోగంగా ఉండేది. రైతులు పండించిన ధాన్యాన్ని ఎరువుల నిల్వలను ఈ గోదాంలో ఉపయోగించే వారు. ప్రసుత్తం మార్కెట్‌ కమిటీ ఆదాయాన్ని కోల్పోగా రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న గోదాంలు మున్సిపాలిటీ నిరుపయోగంగా వదిలేసింది. కనీసం ఇవి మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న విషయం అధికారులకూ తెలియదు.

వృథాగా రైతు బజారు, షెడ్లు, దుకాణాలు

లక్షల రూపాయల వెచ్చించి నిర్మించిన రైతు బజార్‌, షెడ్లు, దుకాణాలు రెండేళ్లుగా నిరుపయోగంగా పడిఉన్నాయి. ప్రస్తుతం షెడ్లు తుప్పు పట్టాయి. 13 దుకాణాలు తాళాలతో దర్శనమిస్తున్నాయి. రైతుబజారు కోసం గత ప్రభుత్వం రూ.20లక్షలు ఖర్చుచేసి అట్టి నిధులతో మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చారు. నెల రోజుల పాటు రైతుబజారును అక్కడ కొనసాగించి నిర్వహణ లోపం కోనుగోలుదారులు లేకపోవడంతో చేతులేత్తేశారు. తాండూరు పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట విచ్చలవిడిగా రోడ్లపైన విక్రయాలు జరుగుతున్నాయి. కూరగాయాలు కోనాలంటే ఒకచోటు, మాంసం కోనాలంటే మరోచోటు ఉండటం వల్ల కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:05 AM