రయ్.. రయ్
ABN, Publish Date - Oct 20 , 2024 | 11:55 PM
‘యమహా ట్రాక్ డే’ ఉర్రూతలూగించింది. రయ్.. రయ్‌మంటూ బైక్ రైడర్లు దూసుకెళ్లారు.
ఉత్సాహంగా యమహా ట్రాక్ డే
శామీర్‌పేట, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘యమహా ట్రాక్ డే’ ఉర్రూతలూగించింది. రయ్.. రయ్‌మంటూ బైక్ రైడర్లు దూసుకెళ్లారు. బొమ్మరాసిపేట పరిధిలోని లియోనియ రిసార్ట్స్‌లోని డిస్ట్రిక్ట్ గ్రావీటి గ్రౌండ్స్‌లోని సర్క్యూట్‌లో యమహా బైక్ కంపెనీ వైభవంగా ట్రాక్ డే నిర్వహించింది. ఈ కార్యక్రమం లో 300కి పైగా ఆసక్తి కలిగిన యమహా ఔత్సాహికులు, 120 మంది యమహా యజమానులు పాల్గొన్నారు. ట్రాక్‌పై హైకానిక్ ఏయిరాక్స్ ఎంటి- 03 మోడళ్ల బైక్‌లతో రైడర్లు సందడి చేశారు.
Updated Date - Oct 20 , 2024 | 11:55 PM