ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:49 PM

ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

కీసర రూరల్‌, సెప్టెంబరు 15: ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం గొల్లగుడెం గ్రామానికి చెందిన కావ్య(18) కీసరలోని ఎస్‌ఎస్‌ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆమె ఉన్నట్టుండి శనివారం అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని ఆస్పత్రి నిర్వాహకులు కావ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కావ్య తండ్రి దేశ్‌పాండే రవి కీసరకు చేరుకుని ఆమెను భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది, గాంధీకి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఆమెను అక్కడి నుండి గాంధీ తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా గుర్తుతెలియని ఆకతాయిలు మూడురోజులుగా ఫోన్‌ ద్వారా అమ్మాయిని వేధించటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:49 PM

Advertising
Advertising