యువత శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ABN, Publish Date - Nov 20 , 2024 | 11:49 PM
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాబోవు కాలంలో భారత్ అగ్రగామిగా నిలవనుందని రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి.సతీ్‌షరెడ్డి అన్నారు.
రక్షణశాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీ్‌షరెడ్డి
గురునానక్ యూనివర్సిటీలో
ఇండియా డిఫెన్స్ అండ్ స్పేస్ కన్వెన్షన్-2024 సదస్సు
ఇబ్రహీంపట్నం, నవంబరు 20(ఆంరఽధజ్యోతి): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాబోవు కాలంలో భారత్ అగ్రగామిగా నిలవనుందని రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి.సతీ్‌షరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అబ్దుల్‌కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యూత్ సౌజన్యంతో బుధవారం ఇన్‌స్సైర్ ఇండియా డిఫెన్స్, స్పేస్ కన్వెన్షన్-2024 సదస్సు నిర్వహించారు. సతీ్‌షరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోని యువతకు డిఫెన్స్, స్పేస్ రంగాల్లో అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు దోహదపడతాయని చెప్పారు. యువత భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. డిఫెన్స్, స్పేస్ రంగాల్లో విద్యార్థుల అభిరుచిని పెంపొందించేందుకు కృషి చేస్తున్న విద్యాలయాల యాజమాన్యాలను అభినందించారు. డా.రాజాసింగ్ తంగదురై, ప్రోగ్రాం డైరెక్టర్ డా.అశోక్‌కుమార్ పాండే, కె.శ్రీనివాసరాజు, సీఈవో జి.శ్రీనివాసరావు, డిప్యుటీ డైరెక్టర్ ఫాజిజ్, గ్రూప్ డైరెక్టర్ ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 11:49 PM