అట్టహాసంగా జోనల్ క్రీడా పోటీలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:11 AM
క్రీడల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు రాణించి దేశానికే ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆకాంక్షించారు.
üషాద్‌నగర్‌రూరల్, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): క్రీడల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు రాణించి దేశానికే ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆకాంక్షించారు. ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో సోమవారం 10వ జోనల్ గేమ్స్‌ను క్రీడా జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ నెల 14 వరకు జరిగే ఈ పోటీల్లో తెలంగాణాలోని 13 గురుకుల పాఠశాలల నుంచి 1300 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గురుకులాల జాయింట్ సెక్రటరీ సంతోషి, ప్రిన్సిపాల్ విద్యులత, ఎంఈఓ మనోహర్ పాల్గొన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 12:11 AM