ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం

ABN, Publish Date - Nov 20 , 2024 | 05:19 AM

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-16పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ జీవో ద్వారా ‘తెలంగాణ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్స్‌ టు పబ్లిక్‌ సర్వీసెస్‌ అండ్‌ రేషనలైజేషన్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ప్యాట్రన్‌ యాక్ట్‌-1994’లో చేర్చిన సెక్షన్‌-10ఏ అక్రమమని తేల్చిచెప్పింది. . జీవో ద్వారా చట్టంలో సవరణలు చేయడం/సెక్షన్లను

చట్టప్రకారం నేరుగా ఉద్యోగాలను భర్తీచేయండి

ఇప్పటికే క్రమబద్ధీకరించిన వారిని తొలగించొద్దు

జీవో ద్వారా చట్టంలో సవరణలు చేయడం చెల్లదు

జీవో 16 ద్వారా చేర్చిన సెక్షన్‌ 10-ఏ చట్టవిరుద్ధం

ఆ సెక్షన్‌ను కొట్టివేస్తున్నాం: హైకోర్టు ధర్మాసనం

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-16పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ జీవో ద్వారా ‘తెలంగాణ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్స్‌ టు పబ్లిక్‌ సర్వీసెస్‌ అండ్‌ రేషనలైజేషన్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ప్యాట్రన్‌ యాక్ట్‌-1994’లో చేర్చిన సెక్షన్‌-10ఏ అక్రమమని తేల్చిచెప్పింది. . జీవో ద్వారా చట్టంలో సవరణలు చేయడం/సెక్షన్లను చేర్చడం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఆ సెక్షన్‌ను కొట్టివేస్తున్నామని మంగళవారం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రెగ్యులరైజ్‌ చేసిన ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. జూనియర్‌ లెక్చరర్లు, పాలిటెక్నిక్‌, డిగ్రీ లెక్చరర్లు, ఇతర కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2016 ఫిబ్రవరి 26న అప్పటి సర్కారు జీవో-16ను జారీ చేసింది. కొలువులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలే తప్ప.. ఇలా క్రమబద్ధీకరించుకుంటూ పోతే.. ఉద్యోగార్థులకు అన్యాయం జరుగుతుందంటూ పలువురు నిరుద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా ఆరు వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఫణిభూషన్‌, బి.రాజేశ్వరి, పి.రామశరణశర్మ, సురేందర్‌రావు, మాదిరాజు శ్రీనివాసరావు తదితరులు వాదనలను వినిపించారు. ‘‘అర్హులైన నిరుద్యోగులు తమ అర్హతలకు తగ్గట్లుగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందాలన్న చట్టబద్ధమైన ఆకాంక్షను, ప్రాథమిక హక్కును ఉల్లంఘించేలా జీవో-16 ఉంది. చట్ట ప్రకారం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కొలువులను భర్తీ చేయాలని. కానీ, దొడ్డిదారిన కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల భర్తీ విషయంలోనూ పారదర్శకమైన విధానాలను పాటించలేదు. నోటిఫికేషన్‌ లేదా కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీ ప్రకటన(పత్రికల్లో అడ్వర్టైజ్‌మెంట్‌) ఇవ్వకుండా.. దొడ్డిదారిలో(బ్యాక్‌డోర్‌) ఉద్యోగులను నియమించుకున్నారు. అలా నియమితులైన వారి సేవలను క్రబద్ధీకరించడం వల్ల అన్నిరకాల సర్వీసు నిబంధనలు, చట్టాలను తుంగలో తొక్కారు. పారదర్శక విధానం లేకుండా సర్వీసుల్లోకి వచ్చిన వారు.. క్రమబద్ధీకరణకు అనర్హులు’’ అని వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాత్రం జీవో-16 ద్వారా చేర్చిన సెక్షన్‌-10ఏను సమర్థించారు. ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడే సెక్షన్‌-10ఏ మార్గర్శకాలను జారీ చేసినట్లు వివరించారు. సుప్రీంకోర్టు కూడా ‘వన్‌టైమ్‌ మెజర్‌’ కింద క్రమబద్ధీకరణ సబబేనని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలా వన్‌టైమ్‌ మెజర్‌ కింద 5,544 పోస్టులను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. ‘‘భవిష్యత్‌లో నేరుగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చాం. ఇది పిటిషనర్ల హక్కులకు భంగం వాటిల్లినట్లు కాదు’’ అని వివరించారు. రెగ్యులరైజ్‌ అయిన పలువురు ఉద్యోగుల తరఫు న్యాయవాది వ్లాదిమిర్‌ ఖటూన్‌ మాట్లాడుతూ.. క్రమబద్ధీకరణ అయిన 5,544 మంది ఉద్యోగులను ప్రతివాదులుగా చేర్చకుండా.. వారికి వ్యతిరేకంగా ఆదేశాలివ్వడం కుదరదని స్పష్టం చేశారు. గతంలో ఈ అంశంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తుచేశారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. జీవో-16 ద్వారా చేర్చిన సెక్షన్‌-10ఏ చట్ట విరుద్ధమని పేర్కొంటూ.. ఆ సెక్షన్‌ను కొట్టివేసింది. అయితే.. ఇప్పటికే ఈ సెక్షన్‌ మేరకు కొలువుల క్రమబద్ధీకరణ జరిగిన ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపై ప్రభుత్వం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కొలువులను భర్తీ చేయాలని.. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సరికాదని హితవు పలికింది.

Updated Date - Nov 20 , 2024 | 05:19 AM