ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Big Breaking: సర్వే చేస్తున్న అధికారులపై మూసీ నివాసితుల దాడి

ABN, Publish Date - Sep 27 , 2024 | 02:03 PM

మూసీ సర్వే చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న నివాసితులు ఇవాళ (శుక్రవారం) సర్వే చేస్తున్న అధికారులపై దాడి చేశారు. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు. ఇక ఆందోళనల్లో భాగంగా లంగర్ హౌజ్ ప్రాంత వాసులు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున గో బ్యాక్ నినాదాలు చేయడంతో అధికారులు వెనుదిరిగారు.

హైదరాబాద్: మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంతో పాటు పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్ల తొలగింపునకు చేపట్టిన ‘ఆపరేషన్ మూసీ’ మరింత ఉద్రిక్తంగా మారింది. సర్వే చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న నివాసితులు ఈ రోజు (శుక్రవారం) సర్వే చేస్తున్న అధికారులపై దాడి చేశారు. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు. ఆందోళనల్లో భాగంగా లంగర్ హౌజ్ ప్రాంత వాసులు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున గో బ్యాక్ నినాదాలు చేయడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.


మద్దతుగా నిలిచిన ఎంపీ..

న్యూ మారుతి నగర్ కాలనీలో మూసీ బాధితులకు మద్దతుగా ఎంపీ ఈటల రాజేంద, బీజేపీ కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళన కొనసాగుతుండగానే మరోవైపు రెవెన్యూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానిక బీజేపీ కార్పొరేటర్ నరసింహ గుప్తా, కాలనీ వాసులతో కలిసి గో బ్యాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మార్కింగ్ చేయవద్దంటూ అధికారులను అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ మీదకు ఎగబడడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.


హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి డ్రామా

హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ డ్రామా ఆడుతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని, హైడ్రా నియామకం అయిన రోజే ఇదంతా డ్రామా అని తాను చెప్పానని ఆయన ప్రస్తావించారు. ‘‘మీ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం చెరువులు, కుంటలు చుట్టూ ఉంది ప్రభుత్వ భూమి కాదు. ఏళ్లుగా ఉన్న వారి ఇళ్లను కూల్చవొద్దు. శత్రు దేశాల సైన్యాలు చేస్తున్న విధంగా కనికరం లేకుండా చేస్తున్నారు. జొన్నల బండ వద్ద ఇందిరాగాంధీ ఇచ్చిన పట్టాల భూముల్లోని నిర్మాణాలను కూల్చే పనులు చేస్తున్నారు. మూసీ నదిని సుందరీకరణ చేస్తే మాకు ఇబ్బంది లేదు. ఏనాడో భూమి కొన్న వాళ్లు ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నారు. లక్షలు పెట్టి కొన్న ఇళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామనడం సరికాదు. ఈ ప్రాంతాల్లో ఏనాడూ మూసీ నీరు రాలేదు. బస్తీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నీ మాటలు నమ్మిన ఖర్మానికి ప్రజలకు ప్రశాంతత లేదు’’ అని అన్నారు.


విశ్వాసం ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడు..

ఖబర్దార్ రేవంత్.. ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు మానుకోవాలంటూ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. మూసీ కూల్చివేతల అంశంపై కేంద్రానికి నివేదిక ఇస్తామని అన్నారు. చట్టాలు, జడ్జీల మీద నమ్మకం లేకుండా పని చేస్తున్నారని, విశ్వాసం ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడు అని ఈటెల అన్నారు. ‘‘చర్చ చేయి. నీ జాగీరు కాదు. ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యావ్. ప్రజల మీద దౌర్జన్యం చేయడం సరికాదు. అవసరమైతే లక్షల మందితో చుట్టు ముడతాం. కోర్టు మెట్లు ఎక్కుతాం. బీజేపీ చూస్తూ కూర్చోదు. చస్తే ఇక్కడే చస్తాం కానీ ఇక్కడ నుంచి కదలము అంటున్నారు స్థానికులు. మాజీ ఆర్థిక మంత్రిగా చెప్తున్నా నీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మంత్రిగా పని చేసిన అనుభవం లేదు. పేద ప్రజల కన్నీళ్లతో అడుకుంటే పతనం తప్పదు’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను: మాజీ మంత్రి హరీష్ రావు

హైడ్రా టార్గెట్‌గా కేటీఆర్ ఘాటు విమర్శలు

Updated Date - Sep 27 , 2024 | 02:08 PM