ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth reddy: పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తాం.. కేటీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Jan 20 , 2024 | 01:03 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటిఆర్‌కు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేళాడదీస్తామని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో రేవంత్ భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చుద్దామన్నా కూడా కనిపించదని వ్యాఖ్యానించారు.


అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తే ఉండదని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి లండన్ వేదికగా స్పందించారు. ఒక్క ఎన్నిక విషయంలోనే బీఆర్ఎస్ నేతలు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదన్నారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత వారికి భయం పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

Updated Date - Jan 20 , 2024 | 03:35 PM

Advertising
Advertising