ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం 587.70 అడుగులు

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:40 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు(312.0450టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 587.80 అడుగులుగా(305.9818టీఎంసీలుగా) ఉంది సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 96,399 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

నాగార్జునసాగర్‌, సెప్టెంబరు 5: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు(312.0450టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 587.80 అడుగులుగా(305.9818టీఎంసీలుగా) ఉంది సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 96,399 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885అడుగులు(215.8070టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా (213.8878టీఎంసీలుగా) ఉంది. శ్రీశైలం ఒక క్రస్ట్‌ గేటును 10అడుగుల మేరకు ఎత్తి 27,937 క్యూసెక్కుల నీటిని, శ్రీశైలం కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 30,708 క్యూసెక్కుల నీటిని, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 37,116 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు మొత్తం 95,761 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 587.80 అడుగులు (305.9818టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 8529 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,476 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 40,405 నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి 95,761 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతుంది.

నిలకడగా పులిచింతల వరద

మేళ్లచెర్వు: పులిచింతలకు ఎగువ నుంచి స్వల్పంగా 57,428 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6,41,250 క్యూసెక్కులుగా నమోదైన వరద నీరు సోమవారం సాయంత్రానికి 5,48,050 క్యూసెక్కులుగా నమోదు కాగా మంగళవారం సాయంత్రానికి 4,07,855 క్యూసెక్కులుగా నమోదైంది. మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక్కసారిగా లక్ష క్యూసెక్కులకు తగ్గిన వరద బుధవారం సాయంత్రానికి 20వేల క్యూసెక్కులుగా నమోదైంది. గురువారం 50వేల క్యూసెక్కులు నమోదు కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు. (45.77) టీఎంసీలు కాగా, 173.78అడుగులు. (43.88 టీఎంసీలుగా) నమోదు కాగా తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం నుంచి 16 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 104 మెగావాట్లను విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా ప్రాజెక్టు మొత్తం ఇన్‌ఫ్లో, ఔట్‌ప్లో 57,482 క్యూసెక్కులుగా నమోదైంది.

ఏడు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

కేతేపల్లి: నల్లగొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దుల్లో గల మూసీ ప్రాజెక్టుకు ఐదు రోజులుగా వరద కొనసాగుతోంది. హైదరాబాద్‌ నగరంతో పాటు ఎగువ ప్రాంతాల్లో రోజుల తరబడి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఆలేరు, బిక్కేరులతో పాటు చిన్నాచితక వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో వరద నీరు దిగువన గల మూసీ ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో మూసీ ప్రాజెక్టుకు వరద నీటిరాకడ భారీగానే ఉంటుంది. ఐదు రోజుల నుంచి ప్రాజెక్టుకు పెరిగిన వరద తాకిడి గురువారం సైతం కొనసాగింది. మంగళ, బుధవారాల్లో ప్రాజెక్టు ఏడు క్రస్టుగేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరదకు మించి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు గురువారం రెండు గేట్లు తగ్గించి ఐదు గేట్లను ఎత్తి 12,111క్యూసెక్కుల వరద నీటిని విడుదుల చేస్తున్నారు. మరోవైపు 641అడుగులకు పడిపోయిన ప్రాజెక్టు నీటిమట్టాన్ని గరిష్ట స్థాయికి చేర్చే చర్యలు చేపట్టారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో 8,773క్యూసెక్కులుగా నమోదైంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులుకాగా గురువారం సాయంత్రానికి నీటిమట్టం 641.30అడుగులుగా నమోదైంది. రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 4.46టీఎంసీలకుగాను ప్రస్తుతం 3.52టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి భారీగా నీటిని వదులుతున్నారు.

Updated Date - Sep 06 , 2024 | 12:40 AM

Advertising
Advertising