ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దీక్ష, సహనానికి ప్రతిరూపం భగీరథ మహర్షి

ABN, Publish Date - May 14 , 2024 | 11:00 PM

భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్టు ఏరియాలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమా లలు వేసి ఘన నివాళి అర్పించారు.

భగీరథ మహర్షి విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన నాయకులు

పాలమూరు, మే 14 : భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్టు ఏరియాలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమా లలు వేసి ఘన నివాళి అర్పించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలనే భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించటం ప్రారంభించినట్లు తెలిపారు. మునిసిపల్‌ చైర్మన్‌ కె.ఆనంద్‌ కుమార్‌గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో వెళ్లి జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్టు ఏరియాలో గల భగీరథ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. బీసీ సమాజ్‌ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో సగర భగీరథ మహర్షి చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ భగీరథ మహార్షి మహాజ్ఞానిగా అభివర్ణించారు. పరోపకారానికి పెట్టింది పేరు అని, దీక్ష, సహనానికి ప్రతిరూపం అని, ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా అనుకున్నది సాధించాడు భగీరథ మహార్షి అని అన్నారు. కార్యక్రమంలో కో-కన్వీనర్‌ సవారి సత్యం, శేఖర్‌, జాండ్ర సంఘం నాయకులు మహేందర్‌, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్‌, రజక నాయకులు నడమింటి శ్రీనివాసులు, కుమ్మరి సంఘం అధ్యక్షుడు బుగ్గన్న, ముదిరాజ్‌ నాయకులు గంజి ఆంజనేయులు, శివన్న, సుక్కలి భాస్కర్‌, మల్లేష్‌, కోళ్ల రాజు, ఆంజనేయులు, మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2024 | 11:00 PM

Advertising
Advertising