ఎట్టకేలకు మోక్షం
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:14 AM
రిజర్వాయర్ స్టేషన్ ఘన్‌పూర్(ఆర్‌ఎస్)కు ఎట్టకేలకు మోక్షం లభించింది. రిజర్వాయర్ అభివృద్ధికి ఈనెల 27న ప్రభుత్వం 148.76కోట్లను మంజూరు చేసింది. దాంతో వివిఽధరకాల పనులు శరవేగంగా జరగనున్నా యి. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2004లో అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
బోయినిగూడెం-నవాబుపేట కాల్వ పనులకు నిధులు
రూ.148.76కోట్లు విడుదల చేసిన సర్కారు
15ఏళ్ల తర్వాత అభివృద్ధి పనులు
1.07లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
స్టేషన్‌ఘన్‌పూర్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రిజర్వాయర్ స్టేషన్ ఘన్‌పూర్(ఆర్‌ఎస్)కు ఎట్టకేలకు మోక్షం లభించింది. రిజర్వాయర్ అభివృద్ధికి ఈనెల 27న ప్రభుత్వం 148.76కోట్లను మంజూరు చేసింది. దాంతో వివిఽధరకాల పనులు శరవేగంగా జరగనున్నా యి. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2004లో అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 2009లో రిజర్వాయర్ పూర్తయి గోదావరి జలాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటు లోకి తెచ్చింది. రిజర్వాయర్ నుంచి జఫర్‌గడ్, రఘునాథపల్లి, లింగాలఘనపురం మండలాలకు, పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు గోదావరి జలాలను తరలించేందుకు మెయిన్ కాల్వను కూడా ఏర్పాటు చేశారు.
మరమ్మతు పనులకు నిధులు..
ఎమ్మెల్యే కడియం గెలుపొందిన తర్వాత గత ఫిబ్ర వరిలో నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఆర్‌ఎస్ ఘన్‌పూర్ మెయిన్ కెనాల్‌ను ఘన్‌పూర్ నుంచి నవాబుపేట వరకు కాలు వ వెంట పర్యటించారు. అధికారులతో సమీక్షించి కాల్వ పనులు పూర్తి చేసి నవాబుపేట రిజర్వాయర్‌కు జలాలు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో నిధులు తీసుకువచ్చారు.
ప్రధాన కాల్వ ఏర్పాటు...
రిజర్వాయర్ పంప్‌హౌస్ నుంచి 12కిలోమీటర్ల పొడవుతో ప్రధాన కాల్వను మండలంలోని బోయిని గూడెం వరకు ఏర్పాటు చేశారు. అక్కడ రెండు మార్గాలుగా విభజించారు. ఒక కెనాల్ పాలకుర్తి రిజర్వాయర్‌కు, మరొకటి లింగాల ఘనపురం మండ లంలోని నవాబుపేట రిజర్వాయర్‌కు వెళ్లేలా కాల్వ ఏర్పాటు చేశారు.
షటర్స్ లేకపోవడంతో..
ప్రధాన కాల్వ ద్వారా వచ్చే జలాలు బోయిన గూడెం వద్ద నుంచి పాలకుర్తి, నవాబుపేట రెండు వైపుల వెళ్లేలా కాలువల నిర్మాణం జరిగినా షటర్స్‌ను ఏర్పాటు చేయలేదు. ఒకవేళ షటర్స్‌ను ఏర్పాటు చేసి ఉంటే ఒకవైపు వాటిని మూసివేస్తే మరోవైపు జలాలు వెళ్లే అవకాశం ఉండేది. ప్రతీ ఏటా జలాలను అధికా రులు విడుదల చేసినా, పాలకుర్తి వైపుగల కెనాల్ వంపుగా ఉండడంతో జలాలు పూర్తిగా ఆటువైపే వెళ్లే పరిస్థితి నెలకొంది. నాటి నుంచి నేటి వరకు నవాబు పేట జలాలు వెళ్లిన దాఖలాలు లేవు.
15ఏళ్ల తర్వాత..
నవాబుపేట కెనాల్ ద్వారా జలాలు ప్రవహించని పరిస్థితి నెలకొంది. ఘన్‌పూర్ మండలంలోని పలు గ్రామాలకు, రఘునాథపల్లి, లింగాలఘనపురం మండ లంలోని అనేక గ్రామాలు సాగుకు నోచుకో లేదు. అప్పటి పాలకుర్తి ఎమ్మెల్యే, మంత్రి దయాకర్ రావు మాత్రం తన నియోజకవర్గానికి ప్రతీ ఏట గోదావరి జలాలను తలరించుకు వెళ్లారనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. బోయినిగూడెం వద్ద నుంచి పా లకుర్తి వరకు గల కెనాల్‌లో ఎలాంటి అడ్డంకులు రా కుండా ఎప్పటికప్పుడు కెనాల్‌ను పర్యవేక్షించి కాల్వకు మరమ్మతు పనులు చేయించినట్టు ఆరోపిస్తున్నారు.
నవాబుపేట కాల్వ అభివృద్ధికి నిధులు..
రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్‌కు 31కిలోమీటర్ల పొడవుతో కెనాల్‌ను తవ్వారు. ఆర్‌ఎస్ మెయిన్ కెనాల్ నుంచి మండలంలోని బోయిన గూడెం వరకు 12 కిలోమీటర్ల దూరం మేర కెనాల్‌కు సీసీ లైనింగ్ పనులు పూర్తిచేశారు. బోయినిగూడెం వద్ద నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు 19కిలోమీరట్ల మేర కెనాల్ పనులను అసంపూర్తిగా వదిలేశారు. సీసీ లైనింగ్ చేయలేదు. తవ్విన కెనాల్ కాస్తా పూడ్చుకు పోయింది. రఘునాథపల్లి మండ లంలోని శ్రీమన్నారాయణపురం -బాంజీపేట గ్రామాల పరిధిలోని కెనాల్‌లో ఇసుక మేటలు వేశాయి. నవాబుపేట రిజర్వాయర్ సమీపంలో కుందారం ఫీడర్ ఛానల్ వద్ద ఓటీని (అండర్ టన్నెల్) ఏర్పాటు చేయాల్సి ఉంది. 16ఎల్, 18ఎల్ సబ్ కెనాల్స్ భూ నిర్వాసితులకు నష్టపరిహరం చెల్లించాల్సి ఉండడడం తో పనులు పెండింగ్ అయ్యాయి. దీంతో అనేక ఏళ్లు గా జలాల కోసం ప్రజల ఎదురుచూపులు ఎదురుచూపులుగానే మారాయి.
ప్రయోజనం పొందే గ్రామాలు...
నవాబుపేట కెనాల్ మరమ్మతు పను లు పూర్తైతే స్టేషన్‌ఘన్‌పూర్ మండలం లోనిబోయినిగూడెం, కోమటిగూడెం, రఘు నాథపల్లి మండలంలోని కంచనపల్లి, బా నాజీపేట, ఎల్లారెడ్డిగూడెం, నారాయణపు రం, కుందారం లింగాలఘనపురం మడం లంలోని నవాబుపేట గ్రామాలతో పాటు రిజర్వాయర్ నిండితే లింగాలఘనపురం మండలంలోని గ్రామాలకు మేలు జరగ నుంది. కెనాల్ పనులు పూర్తైతే 54వేల ఎకరాలకు, నవాబుపేట రిజర్వాయర్ దిగు వన 53వేల ఎకరాలకు సాగునీరు అంద నుంది. దీంతో 1.07లక్షల ఎకరాల ఆయ కట్టు రైతులు రెండు పంటలను పండి చుకునే అవకాశం ఉంది.
Updated Date - Nov 30 , 2024 | 12:14 AM