పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి
ABN, Publish Date - Jun 22 , 2024 | 11:56 PM
వర్షా కాలంలో గ్రామాల్లో రోగాలు ప్రబలకుండా కార్యదర్శులు పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి సురేష్ అన్నారు.
మోతె, జూన్ 22: వర్షా కాలంలో గ్రామాల్లో రోగాలు ప్రబలకుండా కార్యదర్శులు పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి సురేష్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో కార్యద ర్శులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేనందున కార్యదర్శులు ప్రజలకు అందు బాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. వర్షాలు కురుస్తున్న ందున హరితహారంలో మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రికార్డులను సక్రమంగా ఉంచాలన్నారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు చేపడతామన్నారు. అనంతరం హుస్సేనాబాదలో చేపడుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో హరిసింగ్‌నాయక్, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆత్మకూర్(ఎస్): తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సిబ్బంది సిద్ధం ఉండాలని ఎంపీడీవో ఎండీ హసీం అన్నారు. మండల కేంద్రంలోని వన నర్సరీలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మండల పరిధిలో 2.60 లక్షల మొక్కలు నాటేలా జిల్లా అదికారులు లక్ష్యం నిర్థేశించారని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడగానే మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుందని, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో ఈశ్వర్, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2024 | 11:56 PM