ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చెరువు నీటిని కాపాడరూ...

ABN, Publish Date - May 05 , 2024 | 11:46 PM

తమ గ్రామ ఊర చెరువు తూం కు కొత్త గేట్లు నిర్మించి లీకేజీ రూపంలో ఉధృతంగా ది గువకు వెళ్తున్న నీటిని కాపాడాలని కేతేపల్లి మండలంలోని బొప్పారం గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

బొప్పారం ఊరచెరువు తూము గేట్ల నుంచి వృథాగా పోతున్న నీరు

చెరువు నీటిని కాపాడరూ...

బొప్పారంలో వృథాగా పోతున్న నీరు

శిథిలావస్థకు చేరిన చెరువు తూము

పట్టించుకోని అధికారులు

మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్‌

కేతేపల్లి, మే 5: తమ గ్రామ ఊర చెరువు తూం కు కొత్త గేట్లు నిర్మించి లీకేజీ రూపంలో ఉధృతంగా ది గువకు వెళ్తున్న నీటిని కాపాడాలని కేతేపల్లి మండలంలోని బొప్పారం గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. ప్రస్తుత వేసవిలో గ్రామానికి చెందిన జీవాలు, పాడి, వ్యవసాయ పశుసంపదకు తాగునీటి అవసరాల కు ఉపయోగపడుతున్న చెరువు ఖాళీ అవుతుండటం తో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రాజె క్టు కుడి ప్రధాన కాల్వపై బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ఉన్న ఈ ఊరచెరువు నుంచి కాల్వకు నీటిని విడుదల చేసేందుకు ప్రాజెక్టు నిర్మాణ కాలంలో ఏర్పాటు చేసిన మూడు గేట్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. వీటి నుంచి నెల రోజులుగా నీరు వృథాగా వెళుతుంది. బొప్పారం ఊర చెరువు గేట్లు దాని స్ట్రక్చర్‌ నూతనంగా నిర్మించేందుకు ప్రభుత్వం రూ.43లక్షలు మంజూరు చేసినా ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మూసీ కుడి ప్రధాన కాల్వకు గత నెల మొదటి వారం వరకూ నీటిని విడుదల చేయడంతో ఈ చెరువు నీటితో నిండుగా ఉంది. కుడి కాల్వకు నీటి విడుదలను నిలిపివేశాక ఈ చెరువుకు ఉన్న మూడు గేట్లు సైతం మూసివేశారు. అయినా శిథిలమై పోయిన గేట్ల నుంచి ఎంతో విలువైన నీరు వృథాగా దిగువన గల మూసీ కుడి ప్రధాన కాల్వలోకి వెళుతుంది. ఈ తంతు నెల రోజులుగా సాగుతుండటంతో నిండుగా ఉన్న చెరువు కాస్త అడుగంటే స్థితికి చేరింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో మున్ముం దు రోజుల్లో తాగునీటి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్రామంలో ప్రఽ దాన నీటి వనరుగా ఉన్న చెరువును నీటిని కాపాడేందుకు పను లు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 05 , 2024 | 11:47 PM

Advertising
Advertising