ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధ్యాయులు లేక.. బడుల మూత!

ABN, Publish Date - Oct 23 , 2024 | 04:02 AM

కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్‌ మండలంలోని రుసేగావ్‌, సోమూర్‌ గ్రామాల్లో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.

  • నిరుపయోగంగా రుసేగావ్‌, సోమూర్‌ పాఠశాలలు

  • టీచర్లు బదిలీపై వెళ్లడంతో నేటికీ తెరచుకోని వైనం

మద్నూర్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్‌ మండలంలోని రుసేగావ్‌, సోమూర్‌ గ్రామాల్లో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. గతంలో ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు ఇటీవల జరిగిన బదిలీలలో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయా బడులకు టీచర్లను ప్రభుత్వం నియమించలేదు. దీంతో పాఠశాలలు గత పక్షం రోజుల నుంచి నిరుపయోగంగా మారాయి. రుసేగావ్‌ ప్రాథమిక పాఠశాలలో 15 మంది, సోమూర్‌ బడిలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఇటీవల జరిగిన డీఎస్సీ నియామకాల్లో ఎంపికైన 45 మంది ఉపాధ్యాయులు ఉమ్మడి మద్నూర్‌ మండలానికి వచ్చారు. కానీ మారుమూల గ్రామాలైన రుసేగావ్‌, సోమూర్‌ ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటివరకు టీచర్లను నియమించలేదు. దీంతో తమ పిల్లలను చదువుకోవడానికి ఎక్కడికి పంపించాలని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి.. టీచర్లను నియమించాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 04:02 AM