ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

షాక్ ఇస్తున్న శివ బాలకృష్ణ ఆస్తులు.. భూములు ఎన్ని ఎకరాలున్నాయో తెలిస్తే..

ABN, Publish Date - Feb 05 , 2024 | 09:57 PM

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. ఆయన వద్ద బంగారం, వెండి, నగదే కాదు.. భూములు ఎన్ని ఉన్నాయో తెలిసి ఏసీబీ అధికారులే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. ఆయన వద్ద బంగారం, వెండి, నగదే కాదు.. భూములు ఎన్ని ఉన్నాయో తెలిసి ఏసీబీ అధికారులే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 120 ఎకరాలకు పైగా స్థలాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఔటర్ రింగ్‌రోడ్డుతో పాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములను గుర్తించడం జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులను శివ బాకలృష్ణ పెట్టేశారు. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని సైతం ఏసీబీ విచారించింది. బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. సంస్థలకు లబ్ధి చేకూర్చి శివ బాలకృష్ణ వాటాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు.

కాగా.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండీ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న (బుధవారం) బాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో పట్టుబడ్డ ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈరోజు (గురువారం) ఏబీసీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ... బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి వివరాలను తెలియజేశారు.

బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామని తెలిపారు. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (బీ) , 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాలకృష్ణ ఇంటితో పాటు, బంధువులు, సహచురుల ఇళ్లల్లో సోదాలు చేశామన్నారు. బాలకృష్ణ ఇంట్లో రూ. 99.60 లక్షలు నగదు సీజ్ చేశామమని.. బంగారం 1988 గ్రాములు, సిల్వర్ 6 కేజీలు సీజ్ చేసినట్లు చెప్పారు. 8.26 కోట్లు రూపాయలు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూలో ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు. మిగిలిన బీనామీలపై విచారణ చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Updated Date - Feb 05 , 2024 | 09:57 PM

Advertising
Advertising