ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: చట్నీలో చిట్టెలుక ఎలా ఈత కొడుతుందో.. చూశారా?

ABN, Publish Date - Jul 09 , 2024 | 06:54 PM

హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ హోటళ్లలోని వంటశాలలో పరిశుభ్రత పాటించడం లేదంటూ.. ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దాడుల ద్వారా తేటతెల్లమైంది

హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ హోటళ్లలోని వంటశాలలో పరిశుభ్రత పాటించడం లేదంటూ.. ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దాడుల ద్వారా తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో ఆ యా హోటళ్లకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడమే కాకుండా.. సదరు హోటళ్లను సీజ్ సైతం చేశారు. అయితే సుల్తాన్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ హాస్టల్‌ క్యాంటీన్‌ మెస్‌‌లో చట్నీ గిన్నేలో చిట్టెలుక ఈత కొట్టింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సదరు యూనివర్సిటీ కాలేజీలో ఈ విధమైన ఘటన చోటు చేసుకోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Central Ministers: ‘భోగాపురం పనులు’ పరిశీలన.. జగన్ ‘నిధులు’ దుర్వినియోగంపై విచారణ

Also Read: Indian student: న్యూయార్క్‌లో అవినాష్ గద్దె దుర్మరణం


ఈ ఘటన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఈ వీడియో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సీరియస్ అయ్యారు. సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో యూనివర్సిటీలోని క్యాంటీన్ మెస్‌ను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు.

Also Read: SIT's Report: హాత్రాస్‌ తొక్కిసలాటలో ‘కుట్ర కోణం’..!

Also Read: Congress Party: నెల రోజుల పాలనపై ఫైర్.. మోదీ‌కి సంధించిన ‘10 అంశాలు’


ఆ క్రమంలో పరిసరాల పరిశుభ్రతపై మెస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై అటు విద్యార్థులతోపాటు మెస్ సిబ్బందిని వివరణ కోరారు. అయితే యూనివర్సిటీ క్యాంటీన్ మెస్‌లో ఆహార పదార్థాలపై ఉన్నతాధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో క్యాంటీన్ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మెస్ సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ వీడియో దూసుకు పోతుంది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేల మంది ఈ వీడియోను వీక్షించారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 09 , 2024 | 06:55 PM

Advertising
Advertising
<