Kumaram Bheem Asifabad- క్రీడల్లో ప్రతిభ చాటాలి
ABN, Publish Date - Oct 01 , 2024 | 10:36 PM
విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటిలలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. పట్టణంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్ మీట్‌కు కోవ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుందన్నారు
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 1: విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటిలలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. పట్టణంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్ మీట్‌కు కోవ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుందన్నారు. దీంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్యారమ్, చెస్, టెన్నిస్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీడీ రమదేవి, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, కుమరంభీం, మంచిర్యాల జిల్లాల క్రీడల అధికారులు మీనారెడ్డి, బండి జీవరత్నం, ఏసీఎంవో పుర్క ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవోలు చిరంజీవి, ఖమర్ హుస్సేన్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి సాంబశివరావు, హెచ్‌ఎం జంగు, కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్ పాల్గొన్నారు.
Updated Date - Oct 01 , 2024 | 10:36 PM