సమగ్ర ఇంటింటి సర్వే
ABN, Publish Date - Nov 20 , 2024 | 04:05 AM
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన ఇంటింటి సర్వే 83.64 శాతం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,16,14,349 ఇళ్లలో.. మంగళవారం వరకు
83 శాతం పూర్తి
99 శాతంతో ములుగు ప్రథమం
50% తో జీహెచ్‌ఎంసీ చివరి స్థానంలో..
హైదరాబాద్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన ఇంటింటి సర్వే 83.64 శాతం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,16,14,349 ఇళ్లలో.. మంగళవారం వరకు 83,64,331 ఇళ్లలో సర్వే పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా సర్వే పూర్తయిన జిల్లాల్లో 99 శాతంతో ములుగు ప్రథమ స్థానంలో నిలవగా, 95 శాతంతో నల్గొండ, 93.3 శాతంతో జనగాం తృతీయ స్థానంలో నిలిచాయి. 50.3 శాతంతో జీహెచ్‌ఎంసీ చివరి స్థానంలో ఉంది. 87,807 మంది సిబ్బంది, 8,788 మంది పర్యవేక్షక అధికారులు సర్వేలో పాల్గొంటున్నారు. సర్వేకు ప్రజల స్పందన బాగుందని అధికారులు అంటున్నారు.
Updated Date - Nov 20 , 2024 | 04:05 AM