ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Politics: కేసీఆర్ కుటుంబం గజినీలా మారింది: స్పీకర్ గడ్డం ప్రసాద్

ABN, Publish Date - Oct 25 , 2024 | 05:58 PM

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం గజినీలా మారిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించారు.

వికారాబాద్: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం గజినీలా మారిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. "ఓటమి దెబ్బతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు గజినీలా మారిపోయారు. వాళ్లు చేసిన తప్పుల్ని మర్చిపోయి నిత్యం అబద్ధాలు మాట్లాడుతున్నారు. గజినీ సినిమాలో హీరో మాదిరి వాళ్ల ప్రవర్తన ఉంది. బీఆర్ఎస్ పదేళ్లలో ఎన్నడూ రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ ఇచ్చామని కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రచారం చేసుకుంటున్నారు. దామగుండంలో నేవీ రాడార్ కు భూమి కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వమే. ఇప్పుడు తాము కాదంటూ అబద్ధాలు చెబుతున్నారు. ఓటమి దెబ్బతో వారు ఇలా మాట్లాడుతున్నారు.


ఉదయం నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పడం తప్ప నిజాలు చెప్పే పరిస్థితి లేదు. వాటినే పదేళ్లు విన్నాం. ఇకపై ప్రజలు మోసపోవద్దు. కేసీఆర్ తనకోసం తన కుటుంబం కోసం పని చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట కోసం పని చేస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చే వరకు కష్టపడతాం. గతంలో కేసీఆర్ గురుకుల పాఠశాలలు పెట్టి కులాల వారిగా విద్యార్థులను విభజించారు. మా సర్కార్ ప్రతి నియోజకవర్గానికి ఒక అంతర్జాతీయ మోడల్ స్కూల్ నిర్మిస్తోంది. అన్ని వర్గాల ప్రజలకు అందులో ప్రవేశాలు కల్పిస్తాం" అని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి..

Bandi Sanjay: ఇంతకంటే కాస్ట్‌లీ ప్రాజెక్టు.. కాస్ట్ లీ స్కామ్ ఎక్కడా లేదేమో

Kishan Reddy: రేవంత్ నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. అందుకు మేము సిద్ధమే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 25 , 2024 | 05:58 PM