Share News

Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్: పొంగులేటి శ్రీనివాస్

ABN , Publish Date - Oct 26 , 2024 | 06:07 PM

ఇందిర‌మ్మ ఇళ్ల(Indiramma Houses Scheme) ల‌బ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి(Ponguleti Srinivas) శ‌నివారం తెలిపారు.

Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్: పొంగులేటి శ్రీనివాస్

హైదరాబాద్‌: ఇందిర‌మ్మ ఇళ్ల(Indiramma Houses Scheme) ల‌బ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి(Ponguleti Srinivas) శ‌నివారం తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పార‌ద‌ర్శకంగా ఉంటుందని చెప్పారు. అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను స‌చివాలయంలో ప‌రిశీలించారు. యాప్‌లో చేయాల్సిన మార్పులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఆయన సూచ‌న‌ల మేరకు మార్పులు చేసి తరువాతి వారంలో యాప్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు.


అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థకాన్ని ప్రారంభిస్తాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని యాప్‌ తెలుగు వర్షన్‌లో ఉండాలని సూచించా. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల కేటాయింపు వరకు టెక్నాలజీని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలి. అర్హులైన వారందరికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం’’ అని మంత్రి తెలిపారు.

ఇవి కూడాచదవండి..

TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..

Jaggareddy: అవును.. వాళ్లను తిట్టాను.. తప్పేంటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2024 | 06:07 PM