ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తగ్గిన నీటి నిల్వలతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు

ABN, Publish Date - Apr 03 , 2024 | 02:51 AM

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆయకట్టులో పంటలు చేతికి వస్తుండగా, మరోవైపు మరో

శ్రీరాంసాగర్‌లో తగ్గిన నీటి మట్టాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆయకట్టులో పంటలు చేతికి వస్తుండగా, మరోవైపు మరో తడి కోసం నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేకపోవడంతో అధికారులు పంటలకు నీటి విడుదలను నిలిపివేశారు. ఉన్న నీటిని ఇక తాగునీటికి వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే మూడు నెలల పాటు నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాసంగి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే సమయంలో ప్రాజెక్టులో 78 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 12.852 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఎండలు పెరగడం తాగునీటి అవసరాలు జూలై వరకు ఉండటంతో.. ఐదు టీఎంసీల నీటిని అందించేందుకు నిర్ణయించారు. ప్రాజెక్టులో డెడ్‌ స్టోరేజీ ఐదు టీఎంసీలు ఉండగా.. ఆవిరి రూపంలో ఒక టీఎంసీ నీళ్లు వృథా కానున్నాయి. మిగిలిన ఒక టీఎంసీ మేర నీటిని సరస్వతీ, లక్ష్మి కాల్వలతో పాటు ఇతర కాల్వల పరిధిలో ఒక తడికి ఇవ్వాలని నిర్ణయించారు.

Updated Date - Apr 03 , 2024 | 02:51 AM

Advertising
Advertising