ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

థర్మల్‌ విద్యుత్తుకు స్వస్తి!

ABN, Publish Date - Apr 02 , 2024 | 05:15 AM

థర్మల్‌ విద్యుత్తుకు స్వస్తి పలికి.. గ్రీన్‌ ఎనర్జీ వైపు అడుగులు వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. థర్మల్‌ విద్యుత్తుతో ఏ మాత్రం గిట్టుబాటు కాదని, గ్రీన్‌ ఎనర్జీతో కొనుగోలు ధర

సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి

సోలార్‌, పంప్డ్‌స్టోరేజీ, జల విద్యుత్తు వైపే మొగ్గు

కొత్త విద్యుత్తు పాలసీపై రేవంత్‌రెడ్డి సర్కారు నజర్‌

సంప్రదాయేతర ఇంధన వనరులపైనే దృష్టి

సోలార్‌, పంప్డ్‌స్టోరేజీ, జలవిద్యుత్తువైపే మొగ్గు

కొత్త విద్యుత్తు పాలసీపై రేవంత్‌ సర్కారు నజర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): థర్మల్‌ విద్యుత్తుకు స్వస్తి పలికి.. గ్రీన్‌ ఎనర్జీ వైపు అడుగులు వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. థర్మల్‌ విద్యుత్తుతో ఏ మాత్రం గిట్టుబాటు కాదని, గ్రీన్‌ ఎనర్జీతో కొనుగోలు ధర తగ్గుతుందని భావిస్తోంది. దాంతో మున్ముందు థర్మల్‌ కేంద్రాల వైపు వెళ్లకుండా.. తక్కువ ధరకే సోలార్‌/పం్‌ప్డస్టోరేజీ/పవన/జలవిద్యుత్తు కేంద్రాల వైపు అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సౌరవిద్యుత్తుకు యూనిట్‌ ధర రూ.2నుంచి రూ.2.82లోపే ఉంది. థర్మల్‌ విషయానికి వస్తే యూనిట్‌ ధర కనిష్ఠంగా రూ.5గా ఉంది. దాంతో సౌర విద్యుత్తువైపు ప్రభుత్వం దృష్టి పెట్టింది. థర్మల్‌తోపాటు సౌర విద్యుత్తును కలుపుకొంటే.. సగటు కొనుగోలు వ్యయం తగ్గుతుందని భావిస్తోంది. ప్రస్తుతం సగటు విద్యుత్తు కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.4.46 నుంచి రూ.4.50దాకా ఉంది. ఇప్పుడు సౌరవిద్యుత్తు వాటాను భారీగా పెంచితే యూనిట్‌కు రూ.1దాకా తగ్గుతుంని అంచనా వేస్తోంది. అదే జరిగితే విద్యుత్తు కొనుగోలు వ్యయం తగ్గి.. క్రమంగా ప్రభుత్వం డిస్కమ్‌లకు ఇచ్చే సబ్సిడీ కూడా గణనీయంగా తగ్గే అవకాశాలుంటాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అవసరాలకు గాను 2,400 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ప్లాంట్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్టీపీసీతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆ ప్లాంట్లు వద్దని తెలంగాణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ మేరకు సోలార్‌ ప్లాంట్ల నిర్మాణానికి సిద్ధమేనన్నట్లు కేంద్రం సూత్రప్రాయంగా రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తెలంగాణ పవర్‌ పాలసీ

విద్యుత్తు రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, నష్టాల నుంచి బయట పడేందుకు కొత్త పాలసీ తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. విద్యుదుత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూనే.. పునరుత్పాదక విద్యుదుత్పత్తి, సరఫరాను ప్రోత్సహించడం, తక్కువ ధరకు విద్యుత్తు సరఫరా చేసే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించడం, పీపీపీ పద్ధతిలో విద్యుదుత్పతి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యాలతో కొత్త పాలసీని రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో వినియోగదారులపై కరెంట్‌ చార్జీల భారం పడకుండా దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ పవర్‌ పాలసీ ఉండేలా ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలిసింది. తక్కువ ధరతో ఎక్కువ మొత్తంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తి, సరఫరాకు ముందుకు వచ్చే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్లాంట్లు రెండేళ్లలోనే అందుబాటులోకి వస్తాయి. సౌర విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు గరిష్ఠంగా పెరిగే విద్యుత్తు డిమాండ్‌ను తీర్చడానికి సౌర విద్యుత్తుపై అధికంగా ఆధారపడాలని ప్రభుత్వం భావిస్తోంది.

సబ్‌స్టేషన్ల పరిధిలో సోలార్‌ ప్లాంట్లు

రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో సోలార్‌ ప్లాంట్లను నెలకొల్పేందుకు కొత్త పాలసీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) ఆధ్వర్యంలో సోలార్‌ ప్లాంట్లు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులకు ఇందులో భాగస్వామ్యం కల్పించనుంది. రాష్ట్రంలో ఉన్న మేజర్‌, మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా పంప్‌ స్టోరేజీ విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లతోపాటు నిర్మాణంలో ఉన్న వాటి పరిధిలో 6,732 మెగావాట్ల పంప్‌ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్త్తికి అవకాశాలున్నాయని విద్యుత్తు సంస్థలు గతంలోనే అంచనా వేసిన విషయం తెలిసిందే..!

Updated Date - Apr 02 , 2024 | 05:15 AM

Advertising
Advertising