ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Praja Paalana: ప్రజా పాలనలో వింత.. దేవుళ్ల పేరుతో దరఖాస్తు

ABN, Publish Date - Jan 08 , 2024 | 05:30 PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనకు (Praja Paalana) ప్రజల (People) నుంచి విశేష స్పందన వచ్చింది. వరంగల్ (Warangal) జిల్లాలో మాత్రం ఓ వింత జరిగింది. ఏకంగా దేవుళ్ల (God) పేరుతో దరఖాస్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనకు (Praja Paalana) ప్రజల (People) నుంచి విశేష స్పందన వచ్చింది. భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ (Warangal) జిల్లాలో మాత్రం ఓ వింత జరిగింది. ఏకంగా దేవుళ్ల (God) పేరుతో దరఖాస్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

శివయ్య అంటూ

భీమదేవరపల్లి మండలం ముత్తారానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి (Venkata Surender Reddy) ఆ విధంగా దరఖాస్తు చేశారు. తన పేరును ఫామ్‌లో (Form) శివయ్యగా (Shivaiah) రాసుకున్నారు. భార్య పేరు పార్వతీదేవి (Parvathi Devi) అని కుమారుల పేర్లు కుమారస్వామి (Kumara Swamy), వినాయకుడిగా (Vinayakudu) రాశారు. శివుని (Shiva) వయస్సును 1200 ఏళ్లుగా పేర్కొన్నారు. దానిని అధికారులు చూశారో లేదో.. తెలియదు, రసీదు మాత్రం ఇచ్చారు. ఆ దరఖాస్తు ఫొటో తీసి ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ చక్కర్లు కొడుతుంది.

తప్పయ్యింది అంటూ..

వీడియో షేర్ కావడంతో సర్పంచి, గ్రామ పెద్దలతో కలిసి వెంకట సురేందర్ రెడ్డిని పిలిపించారు. ఘటనకు సంబంధించి అధికారులతో మొబైల్‌లో మాట్లాడించారు. జరిగిన ఘటనపై వెంకట సురేందర్ రెడ్డి (Venkata Surender Reddy) విచారం వ్యక్తం చేశారు. పొరపాటు జరిగిందని అంగీకరించారు. ఉద్దేశపూర్వకంగా ఇలా రాయలేదని పేర్కొన్నారు. తనను క్షమించాలని లిఖితపూర్వకంగా అధికారులకు లేఖ కూడా రాశారు.

సరదాగా దరఖాస్తు..?

ప్రజా పాలన దరఖాస్తులో వివరాలు ఇచ్చి, పెన్షన్ కావాలా..? లేదంటే రూ.500కే సిలిండర్ కావాలా..? ఇల్లు కావాలో అప్లై చేయాలి. సురేందర్ రెడ్డి మాత్రం ఏదో సరదాగా దరఖాస్తు చేసి ఇచ్చేశారు. దానికి అధికారులు ఎలా రసీదు ఇచ్చారో తెలియడం లేదు. సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో సదరు వ్యక్తిని పిలించి మాట్లాడారు. తప్పు జరిగిందని అంగీకరించడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 05:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising