ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

ABN, Publish Date - Mar 19 , 2024 | 03:56 AM

మల్లారెడ్డి వర్సిటీ యాజమాన్యం అదనపు ఫీజుల కోసం ఉద్దేశపూర్వకంగా 60 మందిని డిటైన్‌ చేసిందంటూ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్స్‌ మూడో సంవత్సరం విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, తమ నిరసనను వ్యక్తం చేశారు. డీన్‌ కుర్చీ,

60 మందిని ఫీజుల కోసం డిటైన్‌ చేశారని ఆరోపణ..

మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం.. మైనంపల్లి మద్దతు

మేడ్చల్‌ టౌన్‌, షాపూర్‌నగర్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మల్లారెడ్డి వర్సిటీ యాజమాన్యం అదనపు ఫీజుల కోసం ఉద్దేశపూర్వకంగా 60 మందిని డిటైన్‌ చేసిందంటూ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్స్‌ మూడో సంవత్సరం విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, తమ నిరసనను వ్యక్తం చేశారు. డీన్‌ కుర్చీ, ఫర్నిచర్‌ను తీసుకొచ్చి, కళాశాల ఆవరణలో తగులబెట్టారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వర్సిటీకి చేరుకుని, ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు. అగ్రికల్చర్‌ సైన్స్‌ కాలేజీ మూడో సంవత్సరం చదువుతున్న 60 మంది ఒకట్రెండు సబ్జెక్టుల్లో ఫెయిలవ్వగా.. వర్సిటీ యాజమాన్యం వారిని డిటైన్‌(పైతరగతికి వెళ్లనీయకుండా, థర్డ్‌ ఇయర్‌లోనే కూర్చోబెట్టడం) చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. బ్యాక్‌లాగ్స్‌ను క్లియర్‌ చేయడానికి ఏడాది ఫీజును చెల్లించాలని హుకుం జారీ చేశారంటూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థులను చెదరగొట్టే క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్కడికి చేరుకుని, విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే.. మల్లారెడ్డి వర్సిటీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ‘‘ఒక సంవత్సరం అదనపు ఫీజు కోసమే భారీ సంఖ్యలో విద్యార్థులను డిటైన్‌ చేశారు. మల్లారెడ్డి పై ప్రభుత్వం తగు చర్యలు తీసుకునేదాకా వదిలే ప్రసక్తే లేదు. విద్యార్థులకు అండగా ఉంటా’’ అని వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకులకు పనేంటి? బయటివారు వారిని రెచ్చగొటి, ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులను డిటైన్‌ చేయడం ఉద్దేశపూర్వకం కాదు. నిబంధనల మేరకే నడుచుకుంటున్నాం’’ అని వివరించారు. అనంతరం సూరారం మల్లారెడ్డి హెల్త్‌సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రారెడ్డితో కలిసి ఆమె మరికొన్ని వివరాలను వెల్లడించారు. ‘‘అగ్రికల్చర్‌ వర్సిటీలో 22 మంది ఒకట్రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. వారికి ఐదు సార్లు అవకాశమిచ్చాం. అయినా ఫెయిలవ్వడంతో పైతరగతులకు ప్రమోట్‌ చేయలేదు’’ అని తెలిపారు.

Updated Date - Mar 19 , 2024 | 03:56 AM

Advertising
Advertising