కీసరగుట్ట ఆలయ ఈవోగా సుధాకర్ నియామకం
ABN, Publish Date - Jun 22 , 2024 | 11:12 PM
కీసరగుట్ట శ్రీ రామలింగ్వేర స్వామి ఆలయ ఈవోగా సుధాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
కీసర, జూన్22: కీసరగుట్ట శ్రీ రామలింగ్వేర స్వామి ఆలయ ఈవోగా సుధాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కొంత కాలంగా ఇన్‌చార్జి ఈవోగా కీసరగుట్టలో విధులు నిర్వహించిన నరేందర్ అమీర్‌పేటలోని కనకదుర్గ ఆలయం ఈవోగా పూర్తి భాద్యతలతో బదిలీపై వెళ్లగా, కీసరగుట్ట ఈవోగా సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుధాకర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ప్రధాన అర్చకుడు బలరాం శర్మ ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సత్యనారాయణ శర్మ, అధికారులు నారాయణ, వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2024 | 11:12 PM