ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

ABN, Publish Date - Apr 07 , 2024 | 03:29 AM

ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపం చెంది సిరిసిల్లకు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ(66) అనే చేనేత కార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలోని రాజీవ్‌నగర్‌కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని భీవండి వస్త్ర

బాధిత కుటుంబానికి కేటీఆర్‌ పరామర్శ

రూ.50 వేలు సాయం అందజేత

సిరిసిల్ల, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపం చెంది సిరిసిల్లకు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ(66) అనే చేనేత కార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలోని రాజీవ్‌నగర్‌కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని భీవండి వస్త్ర పరిశ్రమలో మరమగ్గాలపై పని చేసినప్పుడు కాలికి గాయమైంది. దీంతో సిరిసిల్లకు వచ్చి మరమగ్గాలు నడుపుతున్నాడు. అతని భార్య వజ్రవ్వ నాలుగేళ్ల క్రితం పక్షవాతానికి గురైంది. లక్ష్మీనారాయణ దంపతుల వైద్యం ఖర్చులు నెలకు రూ.10 వేల వరకు అవుతున్నాయి. ఈ క్రమంలో ఉపాధి లేక మరోపక్క అప్పు దొరక్క మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి తమ పార్టీ తరఫున రూ.50 వేలు అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Updated Date - Apr 07 , 2024 | 03:29 AM

Advertising
Advertising