ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తడిసిన ధాన్యానికీ మద్దతు ధర

ABN, Publish Date - May 09 , 2024 | 05:36 AM

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొంటామని పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

వారంలో ఎన్‌డీఎ్‌సఏ నివేదిక.. 2019లోనే మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొంటామని పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. మిల్లర్లు తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు గతంలో కంటే ఎక్కువ కేంద్రాలు తెరిచామని, ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఇదే సమయానికి 13.77 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ దఫా ఇప్పటిదాకా 24.85 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నామన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు, పిడుగుపాటుతో చనిపోయిన వారికి పరిహారం ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం 2.25 టీఎంసీల నీటిని కర్ణాటక ప్రభుత్వం ఇస్తుందన్నారు. 2019 నవంబరులోనే మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయని, అప్పుడే ఖాళీ చేసి, మరమ్మతులు చేస్తే కుంగేదే కాదన్నారు. బ్యారేజీల్లో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. కమిటీ పూర్తి నివేదిక వారం రోజుల్లో రానుందని, ఆ తర్వాత పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. రైతుబంధును బీజేపీ, బీఆర్‌ఎస్‌ వాళ్లు కలిసి ఆపించారని ఆరోపించారు. ఈ సారి 400 కాదు.. 200 సీట్లు కూడా బీజేపీకి రావని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. జూన్‌ 9న ప్రధానిగా రాహుల్‌ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు అత్యధిక సీట్లు రానున్నాయని, బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గుతాయని, బీఆర్‌ఎ్‌సకు జీరో సీట్లు వ స్తాయన్నారు. క్రిటికల్‌ సీట్లలో సీఎం రేవంత్‌రె డ్డి ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 05:36 AM

Advertising
Advertising