ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ABN, Publish Date - Feb 28 , 2024 | 07:10 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 13వ తేదీన వాయిదా వేసింది. నిజానికి.. ఈ పిటిషన్‌పై విచారణ బుధవారమే జరగాల్సింది. కానీ, కోర్టు సమయం ముగియడంతో వాయిదా వేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 13వ తేదీన వాయిదా వేసింది. నిజానికి.. ఈ పిటిషన్‌పై విచారణ బుధవారమే జరగాల్సింది. కానీ, కోర్టు సమయం ముగియడంతో వాయిదా వేశారు. దీంతో.. త్వరగా విచారణ జరపాలని కవిత తరఫున న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) ప్రత్యేకంగా ప్రస్తావించారు. మార్చి 13వ తేదీన తప్పకుండా విచారిస్తామని.. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది.


ఇదిలావుండగా.. ఢిల్లీ మద్యం కేసులో విచారణకు రావాలని గతేడాది ఈడీ జారీ చేసిన నోటీసుల్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళల్ని దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలని, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేయగా.. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు గత విచారణలో ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2024 | 07:10 PM

Advertising
Advertising