Badrachalam: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఆందోళనకు దిగిన ఆమె బంధువులు
ABN, Publish Date - May 24 , 2024 | 12:41 PM
స్థానిక నర్సింగ్ కళాశాల విద్యార్థిని కారుణ్య (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమె బంధువులు.. కళాశాల ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని.. అలాగే నర్సింగ్ కళాశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
భద్రాచలం, మే 24: స్థానిక మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని పి. కారుణ్య (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమె బంధువులు.. కళాశాల ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని.. అలాగే నర్సింగ్ కళాశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిద్దిఖ్ నగర్ వాసి కారుణ్య. గురువారం ఉదయం హాస్టల్ రూమ్లో నెలపై అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని సహచర విద్యార్థినిలు గమనించారు. దీంతో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆమె మరణించింది.
మరోవైపు కారుణ్య దేహంపై గాయాలు ఉండడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్లోని కారుణ్య గదిలోకి ఆగంతకుడు వచ్చాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు కారుణ్య ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని కొంత మంది సహచర విద్యార్థినిలు పేర్కొంటున్నారు. ఇక కాలేజీ యాజమాన్యం మాత్రం.. కారుణ్య బాత్రూమ్లో పడిపోయిందని చెబుతున్నారు.
దాంతో కారుణ్య మృతిపై భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కారుణ్య అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం జరిపిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైన తర్వాతే.. కారుణ్య మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 24 , 2024 | 03:39 PM