Telangana: యూనిట్లు 294.. కరంట్ బిల్లు రూ. 29 కోట్లు
ABN, Publish Date - Jun 14 , 2024 | 02:37 PM
ఎక్కడైనా.. ఎవరికైనా.. కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది. ఒక నెలలో విద్యుత్ వాడకాన్ని బట్టి కరెంట్ బిల్లు.. వందల్లో.. వేలల్లో వస్తుంది. అదే వాణిజ్య సముదాయం అయితే రూ. లక్షల్లో వస్తుంది.
మహబూబ్‌నగర్, జూన్ 14: ఎక్కడైనా.. ఎవరికైనా.. కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది. ఒక నెలలో విద్యుత్ వాడకాన్ని బట్టి కరెంట్ బిల్లు.. వందల్లో.. వేలల్లో వస్తుంది. అదే వాణిజ్య సముదాయానికి అయితే రూ. లక్షల్లో వస్తుంది. కానీ ఒక ఇంటికి రూ. కోట్లలో బిల్లు వచ్చింది. దీనిని చూసిన సదరు వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో ఇటీవల చోటు చేసుకుంది. జూన్ మొదటి వారంలో ఖానాపూర్ గ్రామంలో సిబ్బంది.. విద్యుత్ బిల్లులు జారీ చేశారు. ఆ క్రమంలో వేమారెడ్డికి విద్యుత్ బిల్లు వచ్చింది.
ఆ బిల్లులో 297 యూనిట్లకు రూ.21,47,48,569 (అంటే రూ. 29 కోట్లు) చెల్లించాలని ముద్రించి ఉంది. మరోవైపు 1970, జనవరి 1వ తేదీ నుంచి 2024, జూన్ 5వ తేదీ వరకు అంటూ సదరు బిల్లులో స్పష్టం చేసి ఉంది. ఈ నేపథ్యంలో షాక్‌కు గురైన వినియోగదారుడు వేమారెడ్డి విద్యుత్ అధికారులను సంప్రదించాడు. దీనిపై విద్యుత్ అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయని స్పష్టం చేశారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇంకోవైపు గతంలో ఇదే తరహాలో రూ. కోట్లలో విద్యుత్ బిల్లులు వచ్చాయని గ్రామస్తులు ఈ సందర్బంగా ఆరోపిస్తున్నారు.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jun 14 , 2024 | 02:37 PM