ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోహీర్‌ @ 9.5

ABN, Publish Date - Nov 20 , 2024 | 05:00 AM

రాష్ట్రంలో చలిపులి విజృంభిస్తోంది. వారం రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఏకంగా 7-8 డిగ్రీల మేర తగ్గాయి. దాంతో చలి తీవ్రత పెరిగింది. చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు

సంగారెడ్డి జిల్లాలో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత

సీజన్‌లో తొలిసారి.. వారంలో 7 డిగ్రీలు పతనం

రాష్ట్రంలో వచ్చే 3 రోజులకు యెల్లో అలెర్ట్‌ జారీ

వారంలో 7-8 డిగ్రీలు పడిన రాత్రి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, కోహీర్‌, ఆసిఫాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలిపులి విజృంభిస్తోంది. వారం రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఏకంగా 7-8 డిగ్రీల మేర తగ్గాయి. దాంతో చలి తీవ్రత పెరిగింది. చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సాయంత్రం 6 గంటలలోపే ఇళ్లలోకి చేరుకుని చలి మంటలు వేసుకున్నారు. రాగల మూడు రోజుల పాటు చలి తీవ్రతకు సంబంధించి హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. 33 జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈ సీజన్‌లో మొదటిసారి సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ఉష్ణోగ్రత అత్యల్పంగా 9.5 డిగ్రీలకు పడిపోయింది. కోహీర్‌లో గతేడాది ఇదే సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 16.4 డిగ్రీలు నమోదు కాగా... తాజాగా అది పదిలోపునకు పడిపోయింది. కేవలం ఒక్క రోజులోనే ఆ ప్రాంతంలో ఏకంగా 5 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రాగల మూడు రోజుల పాటు రాత్రిపూట 10-13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వాతావరణశాఖ వెల్లడించింది.

Updated Date - Nov 20 , 2024 | 05:00 AM