ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BB Nagar: కులాంతర వివాహమే ప్రేమకు శాపమై..

ABN, Publish Date - May 16 , 2024 | 05:23 AM

పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకోవడమే ఆ ప్రేమ జంట పాలిట శాపమైంది. కుల సమస్య ఇరుకుటుంబాల్లో రేపిన కల్లోలం ఆ జంట బలవన్మరాణాలకు కారణమైంది. పెళ్లైన 20 రోజులకే ఆ జంటలోని వధువు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మరణంతో జైలుపాలై ఇటీవల విడుదలైన భర్త.. మనస్తాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చీమలకొండూరుకు చెందిన బిట్కూరి మనోహర్‌(25), పల్లెర్ల భూమిక ప్రేమికులు.

  • పెళ్లైన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య

  • ఆ కేసులో జైలుకెళ్లి ఇటీవల విడుదలైన భర్త

  • తీవ్ర మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య

బీబీనగర్‌, మే 15: పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకోవడమే ఆ ప్రేమ జంట పాలిట శాపమైంది. కుల సమస్య ఇరుకుటుంబాల్లో రేపిన కల్లోలం ఆ జంట బలవన్మరాణాలకు కారణమైంది. పెళ్లైన 20 రోజులకే ఆ జంటలోని వధువు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మరణంతో జైలుపాలై ఇటీవల విడుదలైన భర్త.. మనస్తాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చీమలకొండూరుకు చెందిన బిట్కూరి మనోహర్‌(25), పల్లెర్ల భూమిక ప్రేమికులు. వేర్వేరు కులాలు వారు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనోహర్‌, భూమిక ఫిబ్రవరి 17న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం మనోహర్‌ తన భార్య భూమికను తమ ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, కులం తక్కువదానివంటూ భూమికకు అత్తింటి వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపం చెంది పుట్టింటికి వెళ్లినభూమిక మార్చి 6న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు భూమికను వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మార్చి 9న మరణించింది.


భూమిక మరణ వార్త తెలిసిన వెంటనే మనోహర్‌ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబసభ్యులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మరోపక్క, అత్తింటి వేధింపుల వల్లే భూమిక ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదుతో మనోహర్‌, అతని తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలు జైలులో ఉన్న ఆ కుటుంబం పది రోజుల క్రితం బెయిలుపై విడుదలైంది. ఈ నెల 13న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మనోహర్‌.. తల్లిదండ్రుల సూచన మేరకు బీబీనగర్‌ మండలం జైనపల్లిలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. అయితే, తన జీవితంలో జరిగిన ఘటనలతో తీవ్ర మనస్తాపంతో ఉన్న మనోహర్‌.. బీబీనగర్‌, ముగ్దుంపల్లి రోడ్డులోని ఓ వెంచర్‌లోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామ నిర్వహించారు. మనోహర్‌ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - May 16 , 2024 | 05:23 AM

Advertising
Advertising