ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం, మంత్రికి మంచి బుద్ధి ప్రసాదించాలి

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:27 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు భీమలింగేశ్వరుడిని వేడుకున్నారు.

సంగెంలో భీమలింగానికి పూజలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా సంగెంలో భీమలింగేశ్వరుడికి అభిషేకాలు

వలిగొండ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు భీమలింగేశ్వరుడిని వేడుకున్నారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలో భీమలింగానికి బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కీసర రాంరెడ్డి, కాసుల కృష్ణ, వరికుప్పల మల్లేష్‌ మాట్లాడుతూ ఈ నెల 8న మూసీ పునరుజ్జీవయాత్ర పేరుతో సంగెం గ్రామానికి సీఎం, జిల్లా మంత్రి వచ్చిన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ‘బుల్డోజర్లతో తొక్కిస్తా.. కుక్క చావు చస్తావు’ అంటూ హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడారని సీఎం, మంత్రిపై వలిగొండ పోలీ్‌సస్టేషన్లో ఫిర్యా దు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్‌, సింగిల్‌విండో చైర్మన్‌ సురకంటి వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ కో-ఆర్డినేటర్‌ పడమటి మమత, నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, అఫ్రోజ్‌, పల్సం రమేష్‌, నాయకులు వలమల్ల కృష్ణ, మద్దెల మంజుల, డేగల పాండు, ఎడ్ల నిరంజన్‌రెడ్డి, మద్దెల సందీప్‌, మారయ్య, శేఖర్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:27 AM