Manchiryāla- మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం
ABN, Publish Date - Mar 13 , 2024 | 10:20 PM
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని సంఘం నాయకులు అన్నారు. ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మున్నూరు కాపు సంఘం నాయకులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.
ఏసీసీ, మార్చి 13: మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని సంఘం నాయకులు అన్నారు. ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మున్నూరు కాపు సంఘం నాయకులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, నల్ల శంకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, సీతక్క, శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రా వుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో పూదరి తిరుపతి, తూములనరేష్, బోరిగం రాజరారాం, కిషన్, శ్రీనివాస్, బోయిని శ్రీనివాస్, దాసరి లచ్చన్న , శ్రీదేవి, ప్రభాకర్, రాజు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిటౌన్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాపుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ పరిణామమని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్ట లక్ష్మణ్ , పట్టణ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పటేల్ అన్నారు. బుధవారం మందమర్రిలో వారు మాట్లాడుతూ గతంలో మున్నూరు కాపులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో కుమారస్వామి, సతీష్, జనార్ధన్, శ్రీనివాస్, రవీందర్, సంజీవ్, క్రాంతికుమార్ , శ్యాం, సత్తయ్య, బాపు, సంజీవ్ పటేల్‌లు పాల్గొన్నారు.
Updated Date - Mar 13 , 2024 | 10:20 PM