ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manchiryāla- జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి

ABN, Publish Date - Jul 26 , 2024 | 10:47 PM

కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే 2024లో రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని డీఈవో యాదయ్య అన్నారు. ప్రాథమిక పాఠశాలల సబ్జెక్టు డీఆర్‌పీలకు జిల్లా సైన్స్‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మాట్లాడుతున్న డీఈవో యాదయ్య

ఏసీసీ, జూలై 26 : కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే 2024లో రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని డీఈవో యాదయ్య అన్నారు. ప్రాథమిక పాఠశాలల సబ్జెక్టు డీఆర్‌పీలకు జిల్లా సైన్స్‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ జిల్లా ముందు వరుసలో ఉండడానికి విద్యార్థులకు లక్ష్యాత్మకంగా బోధించడం ఒకటే మార్గమన్నారు. అందరు విద్యార్థులు అభ్యాసన ఫలితాలు సాధించేలా వ్యూహాత్మకంగా బోధించాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్‌లు చౌదరి శ్రీనివాస్‌, సత్యనారాయణమూర్తి, డీఆర్‌పీలు పాల్గొన్నారు.

హాజీపూర్‌: మండలంలోని దొనబండ, నరసింగపూర్‌ ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం డీఈవో యాదయ్య తనిఖీ చేశారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. విద్యార్థులను పాఠ్యాంశాలు ఎక్కడి వరకు బోధించారని అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఆదర్శ కమిటీ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు హనుమాండ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 10:47 PM

Advertising
Advertising
<