ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పదవీకాలం పొడిగించొద్దు.. పదోన్నతులివ్వాలి

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:16 AM

పదవీ విరమణ చేసిన వారిని సలహాదారులుగా, ఓఎస్డీలు, కన్సల్టెంట్లుగా నియమించుకోవాలని, కేడర్‌ పోస్టుల్లో పదవీ కాలం పొడిగించరాదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు డిమాండ్‌ చేశారు.

జలసౌధ ముందు ఇంజనీర్ల నిరసన

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పదవీ విరమణ చేసిన వారిని సలహాదారులుగా, ఓఎస్డీలు, కన్సల్టెంట్లుగా నియమించుకోవాలని, కేడర్‌ పోస్టుల్లో పదవీ కాలం పొడిగించరాదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు డిమాండ్‌ చేశారు. జలసౌధలో మంగళవారం భోజన విరామ సమయంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం(టీజీవో)ల ఆధ్వర్యంలో ఇంజనీర్లు నిరసన తెలిపారు. కేడర్‌ పోస్టుల్లో పనిచేస్తూ పదవీ విరమణ చేసినవారి సర్వీసు పొడిగిస్తే... ఆ ప్రభావం సర్వీసులో ఉన్న ఇంజనీర్లపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వీసు కాలాన్ని పొడిగించకుండా... వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరసన అనంతరం తొలుత ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ను, తర్వాత సచివాలయంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను టీజీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు కలిసి వినతిపత్రాన్ని అందించారు.

Updated Date - Nov 20 , 2024 | 04:16 AM