గతమెంతో ఘనం నేడు జీవనమే గగనం
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:28 AM
చండూరుకు మారుపేరుగా నిలిచేవి ఇత్తడి వస్తువులు. అక్కడ తయారైన ఇత్తడి వస్తువులకు ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ ఉండేది.
చండూరుకు మారుపేరుగా నిలిచేవి ఇత్తడి వస్తువులు. అక్కడ తయారైన ఇత్తడి వస్తువులకు ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ ఉండేది. వాటిని తయారు చేసేందుకు ఇక్కడ 200 కుటుంబాల వరకు ఉండేవి. ఇత్తడి వస్తువుల తయారు చేసే వారు తమ కు టుంబాలను ఎంతో దర్జాగా పోషించుకునే వారు. ఈ ప్రాంతంలో ఒకనాడు వైభవం పొందిన కంచరి వృత్తి క్రమంగా కనుమరుగవుతోంది. ఇత్తడికి ప్రత్యామ్నాయ వస్తువుల రాకతో ఉపాధి కరువై వృత్తికళాకారులు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. ఒకప్పుడు 200 కుటుంబాలు ఉన్న ఈ పట్టణంలో ప్రస్తుతం వారి సంఖ్య 10కి పడిపోయింది. ఒకప్పుడు ఖంగు మనే శబ్ధాల తో మార్మోగిన ప్రాంతం నేడు నిశ్శబ్ధం నెలకొంది.
(ఆంధ్రజ్యోతి-చండూరు)
ఒకప్పుడు చండూరు పేరు అంటేనే ఇత్తడి వస్తువుల తయారీకి ప్రఖ్యాతిగాంచిన ప్రాం తం. ఇక్కడ తయార య్యే ఇత్తడి వస్తువులనే పుత్తడి వస్తువులుగా భావించేవారు. అంతటి ఘనకీర్తి ఇక్కడి వృత్తికళాకారు ల సొంతం. వాటిని తయారు చేసే కళాకారుల కుటుంబాలు పుత్తడిలా వెలిగేవి. ఇప్పటికీ ఇత్తడి బిందెలను విక్రయించే సమయంలో చండూరు బిందెలని పేరు చెప్పి ప్రస్తావిస్తున్నారంటే చండూరు ఇత్తడి వస్తువులకు ఎంతటి పేరు ఉందో అర్థమవుతోంది. అంతటి ఇత్తడి వస్తువుల ప్రాముఖ్యం తగ్గడంతో కళాకారులకూ ఉపాధి కరువైంది. మార్కెట్ లో ప్రత్యామ్నాయ వస్తువులు రావడంతో గిరాకీ తగ్గిం ది. దీంతో వీటిని తయారీ చేసే కళాకారులు వృత్తిని వదిలి, ఇతర వృత్తిని వెతుక్కుం టూ వేరే ప్రాంతాల కు వలసలు వెళ్తున్నారు. ఒకప్పుడు 200కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి ఉండేవి. నేడు కేవలం 10 కుటుంబాలే వృత్తిని కొనసాగిస్తున్నాయి.
ఒకప్పుడు కళకళ..
చండూరులో చిన్న పాత్రల తయారీ మొదలుకుని పెద్దపెద్ద గంగాళాల వరకూ తయారు చేసేవారు. పెళ్లి ళ్ల సీజన్ వచ్చిందంటే రాత్రింబవళ్లు కష్టపడినా సమ యం సరిపోయేది కాదు.పెళ్లిళ్లలో వధువుకు ఇత్తడి వస్తువులు కానుకగా ఇవ్వడం గొప్పగా భావించేవారు. తినే కంచం మొదలు మోసే బిందెలు, బకెట్లు అన్నీ ఇత్తడివే ఉండేవి. ధనవంతుల పెళ్లిళ్లకు పెద్దపెద్ద పాత్రలు తయారీ చేసి వాటిని కూడా కట్నంగా ఇచ్చేవారు. కట్నాల చదివింపులో కూడా ఇత్తడి వస్తువులనే ఇచ్చేవారు. బిందెలు, బకెట్లు, కంచాలు ఉండేవి. పూజా సామాగ్రి ఇత్తడివే పెట్టేందుకు ఆసక్తి చూపేవారు. దీంతో ఒకప్పుడు చండూరు మీదుగా వెళ్లే ప్రతీ బస్సుపై నా, బస్సులోనూ పెద్దపెద్ద డాగులు, ఇతర ఇత్తడి వస్తువులతో నిండి ఉండేది. వీటిలో బస్సులో, బస్సుపైన తరలించేందుకు ఏడు, ఎనిమిది మంది కూలీ లు ఉండేవారు. వీటికి ప్రాధాన్యం ఎప్పుడైతే తగ్గిపోయిందో చండూరులో బస్సు కూలీలు లేకుండాపోయారు. వారు కూడా ఇతర ఉపాధి మార్గాల వైపు మళ్లారు.
చవకగా లభిస్తుండడంతో ...
ఇత్తడి వస్తువులు చాలా ఖరీదైనవి. అయితే వీటికి ప్రత్యామ్నాయ వస్తువులు మార్కెట్‌లోకి రావడంతో కంచరి వృత్తి ఆదరణ కోల్పోవడం ప్రారంభమైంది. ఇం ట్లో ఇత్తడి బిందెలకు బదులు స్టీలు బిందెలు, ప్లాస్టిక్ బకెట్లు మార్కెట్లోకి రావడం, అవి చవకగా, తరలించడానికి సులభంగా ఉండడంతో ప్రజలు మొగ్గుచూప డం మొదలుపెట్టారు. ఊరూరా టెంట్‌హౌస్‌లతో పెళ్లిళ్లకు అవసరమైన పెద్దపెద్ద పాత్రలు, గుండీల వాడ కం తగ్గింది. దీంతో వృత్తి వారు ఎక్కడ జీవనాధారం దొరుకుతుందో అక్కడికి వలస వెళ్తున్నారు.
Updated Date - Nov 21 , 2024 | 12:28 AM