ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manchiryāla- సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN, Publish Date - Jul 26 , 2024 | 10:51 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాలను శుక్రవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు.

జైపూర్‌లోని పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, జూలై 26: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాలను శుక్రవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించారు. గదుల్లో వర్షం నీరు పడుతుండడం లాంటి సమస్యలున్నాయా అని హెచ్‌ఎం ఆలీష్‌మాధుర్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ సూచించారు. ప్రైమరీ పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు లీవు లెటర్‌ మాత్రమే రాశారని, ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు చేయలేదని ప్రధానోపాధ్యాయులను ప్రశ్నించారు. లీవులో ఉన్న సదరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థులకు చదువు నిమిత్తం ప్రభుత్వం ఎన్నో నిధులు సమకూరుస్తుందని. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jul 26 , 2024 | 10:51 PM

Advertising
Advertising
<