ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయం!

ABN, Publish Date - Mar 19 , 2024 | 04:25 AM

మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. బీఆర్‌ఎ్‌సను వీడటం ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్లు సమాచారం. మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో భేటీలో స్పష్టం చేసిన మల్లారెడ్డి

హైదరాబాద్‌ సిటీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) .. బీఆర్‌ఎ్‌సను (BRS) వీడటం ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్లు సమాచారం. మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఎన్నికల్లో సహకరించాలన్న ఎజెండాతో ఆదివారం మల్లారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు, ముఖ్యంగా మల్లారెడ్డి పార్టీ మార్పుపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘నేను పార్ట్‌ టైం పొలిటీషియన్‌.. ఫుల్‌ టైం బిజినె్‌సమేన్‌ను. వ్యాపారపరంగా కొన్ని సమస్యలున్నాయి. వాటి పరిష్కారం కోసం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని మల్లారెడ్డి అన్నట్లు తెలిసింది. తాను పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానని, ఏ పార్టీలో చేరుతానన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. వ్యాపార అవసరాలతోపాటు రాష్ట్రంలోని కొందరు నాయకులు అడ్డుపడుతున్నందునే.. బెంగళూరులో డీకే శివకుమార్‌ను కలిసి కాంగ్రె్‌సలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసిన విషయాన్నీ ఈ సమావేశంలో మల్లారెడ్డి వెల్లడించినట్లు తెలిసిం ది.

ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. బీఆర్‌ఎ్‌సలో కొనసాగేందుకు ఆయన నిరాసక్తత చూపారని ఓ ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రె్‌సలో చేరేందుకే మల్లారెడ్డి మొగ్గుచూపుతున్నారని, అది సాధ్యం కాకపోతే బీజేపీలోకి వెళ్లేందుకూ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతానని భేటీలో స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో అల్లుడి నిర్ణయంతో తనకు సంబంధం లేదని, పార్టీ మారేందుకు తన ప్రయత్నాలు తాను చేసుకుంటానని మల్లారెడ్డి చెప్పినట్లు తెలిసింది. కాగా, పార్టీ అగ్రనేతల సూచన మేరకే ఎమ్మెల్యేలు మల్లారెడ్డి నివాసంలో సమావేశమైనట్లు సమాచారం.

Updated Date - Mar 19 , 2024 | 09:18 AM

Advertising
Advertising